• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సేల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్.. లీటర్ రూ.5 వేలు.. అన్నీ దేశాల ఎయిర్.. పరిమళాలు కూడా..

|

కరోనా వైరస్ వల్ల చిత్ర, విచిత్ర అనుభవాలు వస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకొనేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నాం. చికెన్, ఎగ్ సేల్స్ మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే స్వచ్చమైన గాలి కూడా అవసరమే.. ప్రజల అవసరాన్ని గ్రహించిన మై బ్యాగేజ్ సంస్థ స్వచ్చమైన గాలిని కూడా విక్రయిస్తోంది. లీటర్ ఫ్యూర్ ఎయిర్ కావాలంటే మీరు రూ.5 వేలు చెల్లించాల్సిందే.

కొత్త రకం వైరస్ టెన్షన్.. గాలి సేల్

కొత్త రకం వైరస్ టెన్షన్.. గాలి సేల్

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్-19 కంటే ఈ వైరస్ 75 శాతం అధికంగా వ్యాప్తిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. బ్రిటన్‌తో లింక్‌లు కట్ చేశాయి. యూకే నుంచి పలు దేశాలకు సాగించే రాకపోకలు విమానాలపై నిషేధం విధించాయి. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులు క్రిస్మస్‌ సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక్కసారైనా క్రిస్మస్ కు వచ్చి సొంతప్రాంతాల గాలిని మనసారా ఆస్వాదించాలనుకునే వారి ఆశ ఈ వైరస్ ల పుణ్యమాని నెరవేరటంలేదు.

 బ్రిటన్ గాలి.. ఇతర దేశాలవి కూడా..

బ్రిటన్ గాలి.. ఇతర దేశాలవి కూడా..

గాలిని సీసాల్లోకి పట్టి అమ్ముతున్నారు. యూకేలోని దేశాల్లో గాలిని సీసాల్లోకి పట్టి విక్రయిస్తున్నారు. మై బ్యాగేజ్ అనే సంస్థ ఈ వ్యాపారం చేస్తోంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ దేశాల్లో స్వచ్చమైన గాలి వ్యాపారం చేస్తున్నారు. అర లీటర్ గాలి బాటిల్ 25 పౌండ్లు చొప్పున అమ్ముతున్నారు. భారత కరెన్సీలో రూ.2500. లీటర్ గాలి రూ.5వేలు చెల్లించాల్సిందే. బ్రిటన్‌లో ఉండే స్వచ్ఛమైన గాలిని ప్రపంచ దేశాల్లో ఉన్న బ్రిటన్ వాసులకు అందిస్తామని ప్రకటించింది. నచ్చిన ప్రాంతాల నుంచి గాలిని సేకరించి.. దాన్ని బాటిల్స్‌లో నింపి.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పంపిస్తామని ప్రకటించింది.

పరిమళాలు కూడా..

పరిమళాలు కూడా..

మై బ్యాగేజ్ సంస్థ ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్ నుంచి స్వచ్ఛమైన గాలిని సేకరిస్తోంది. ఈ గాలిని బాటిల్స్‌లో నింపి విక్రయిస్తోంది. 500 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఫ్రెష్ ఎయిర్ బాటిల్స్ లభిస్తాయి. బాటిల్స్ కార్క్ ఓపెన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛమైన గాలిని, అందులోని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు. కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు.. అందులో పలు రకాల ఫ్లేవర్స్ కూడా అందిస్తోంది. చేపల వాసన, చిప్స్ వాసన, పంట పొలాల పరిమళాలు.. ఇలా ఏది కోరితే ఆ అరోమాను నింపి అందజేస్తారు. ఇంటిపై బెంగ పెట్టుకున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బాటిల్స్‌ను అమ్ముతున్నారు.

English summary
bottles of fresh air from england ireland scotland and wales for sale for 25 pounds each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X