వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ : మొసలి బారినుండి చెల్లెను కాపాడిన 15 ఏళ్ల బాలుడు

|
Google Oneindia TeluguNews

కుటుంబ సభ్యులు ఎంతటి ప్రమాదంలో ఉన్నా మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మన రక్తసంబంధం కాబట్టి. అలానే ఫిలిప్పీన్స్‌లో కూడా తన చెల్లెలును కాపాడేందుకు ఓ అన్న తన ప్రాణాలను లెక్క చేయలేదు. ప్రాణాలు పోతాయని తెలిసీ రిస్క్ చేశాడు. ఇంతకీ ఆ అన్న చేసిన రిస్క్ ఏంటి..?

చెల్లెలి కాలును పట్టుకున్న మొసలి

చెల్లెలి కాలును పట్టుకున్న మొసలి

ఫిలిప్పీన్స్‌ దేశంలోని పాలవాన్‌లో హైనా లీసా జోస్ హబీ మరియు హషీమ్‌ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు ఉన్నారు. చెల్లెలు హైనా వయస్సు 12 ఏళ్లు కాగా.. అన్న హషీమ్ వయస్సు 15 ఏళ్లు. ఇద్దరూ కొద్దిరోజుల క్రితం నడుచుకుంటూ కాలువ దాటుతుండగా హఠాత్తుగా హైనా లీసా కేకలు వినిపించాయి. ముందు వెళుతున్న హషీమ్ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూశాడు. ఇంకే ముందు హైనా కాలును ఓ పెద్ద మొసలి పట్టేసుకుంది.

మొసలిపై రాళ్లతో దాడి చేసిన హషీమ్

మొసలిపై రాళ్లతో దాడి చేసిన హషీమ్

తన చెల్లి కాలు మొసలి తన నోటితో పట్టేసుకోవడంతో హషీమ్ చాలా తెలివిగా రియాక్ట్ అయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న రాళ్లు తీసుకుని ఆ మొసలిపై వేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రాళ్లు మొసలిపై వేయడంతో ఒక్కసారిగా హైనా లీసా కాలును వదిలేసింది. వెంటనే లీసాను బయటకు లాగేశాడు హషీం. అయితే మొసలి పదునైన పళ్లతో కాలును పట్టుకోవడంతో లీసాకు తీవ్రగాయమైంది. అయితే ప్రాణాలతో మాత్రం బతికే ఉంది. చెల్లెలను మొసలి బారి నుంచి కాపాడిన చిన్నారి హషీమ్‌ను అంతా ప్రశంసిస్తున్నారు. ఆ పిల్లాడి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.

 మొసలిని చూస్తే భయమేసిందన్న హైనా

మొసలిని చూస్తే భయమేసిందన్న హైనా


ఇదిలా ఉంటే తన కాలును పట్టుకున్న మొసలి చాలా పెద్దదిగా ఉందని దాన్ని చూశాకా భయమేసిందని చెప్పింది గాయపడ్డ హైనా లీసా. హషీమ్ ముందు వెళుతుండగా మొసలి కాలు పట్టేసుకోవడంతో గట్టిగా కేకలు వేసినట్లు చెప్పింది. హషీమ్ తన జీవితాన్ని కాపాడాడని హైనా చెప్పుకొచ్చింది. ముందుగా తను బ్రిడ్జ్‌ను దాటేసినట్లు చెప్పిన హషీం వెనకాల చూస్తే హైనా లీసా కనిపించలేదని చెప్పాడు. కేకలు విని ముందుగా తాను కింద పడిపోయినట్లు భావించానని కానీ అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నిందని వెల్లడించాడు.

జాగ్రత్త కాలువలో నడవరాదని పోలీసుల హుకూం

జాగ్రత్త కాలువలో నడవరాదని పోలీసుల హుకూం

"పాలవాన్‌లో నివాసముంటున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మొసళ్ల సంచారం బాగానే ఉంది. ఈ మొసలి మరింత మందిపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకే కాలువలను దాటే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ మొసలిని పట్టుకుని ఇతర ప్రదేశంలో వదిలే వరకు ఈ కాలువ దగ్గరకు రాకపోవడం మంచిది. మరో దారి గుండా ప్రజలు వెళ్లాలి" అని స్థానిక పోలీసులు చెప్పారు. ఆ చిన్నారి బతికి బయటపడిందంటే ఆమె అదృష్టవంతురాలే అని ఆమె ఈరోజు ఊపిరి తీసుకుంటోందంటే అది తన అన్న చూపిన సాహసమేనని పోలీసులు కొనియాడారు.

English summary
A 15-year-old boy has been hailed as a hero for his bravery. Without panicking in a dangerous situation and with his quick-actions, the boy fought with a crocodile to save his younger sister’s life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X