గర్ల్ ఫ్రెండ్‌ను డేటింగ్‌కి పిలిచి.. సైకోలా తీవ్రంగా హింసించి చంపేశాడు!
న్యూయార్క్: ఓ చీర్ గర్ల్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరికీ అనుమానం కలగకుండా చంపేశాడు. చాలాకాలంగా తాము ప్రేమించుకుంటున్నామని, శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో ఆమె అనుమానాస్పదంగా చనిపోయిందంటూ అతడు తొలుత నమ్మించినా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
తన గర్ల్‌ఫ్రెండ్‌ను డేటింగ్‌కు పిలిచి ప్రేమగానే ఆమెను దగ్గరికి తీసుకున్న అతడు.. ఆ తరువాత ఓ సైకోలాగ మరి ఆమెను శారీరకంగా తీవ్రంగా హింసించి చంపేసినట్లు ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తేల్చారు.
వివరాల్లోకి వెళితే... టెక్సాస్‌కు చెందిన కేలీ మండాడి(19) ట్రినిటీ యూనివర్సిటీలో చీర్‌గర్ల్‌గా పనిచేస్తోంది. మార్క్ హోర్టన్(22) అనే యువకుడు, కేలీ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న మార్క్ హోర్టన్ తన ప్రేయసి కేలీని డేటింగ్‌కు పిలిచాడు.
ఆమె కూడా ఇష్టంగానే అతడు పిలిచిన చోటికి వెళ్లింది. అనంతరం కేలీ తీవ్రగాయాల పాలైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె దుస్తులు చిరిగిపోయి ఉండటం, ఆమె తీవ్రంగా గాయపడి ఉంటం, దీనికితోడు తామిద్దరం శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించామని మార్క్ చెప్పడంతో పోలీసులు అతడిపై రేప్ కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియురాలితో సెక్స్‌లో పాల్గొనే క్రమంలో మార్క్ ఆమెను తీవ్రంగా హింసించాడని, ఆమె ఒంటిపై ఉన్న గాయాలన్నీ అతడు చేసినవేనని తేలింది. గతంలో కూడా అతడిపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైకోలాగా మారి భౌతికంగా కేలీని హింసించిన కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు.