వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

54 రోజులు బ్రెయిన్ డెడ్: బిడ్డకు జన్మనిచ్చిన మహిళ (వీడియో)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వైద్యులు తలుచుకుంటే చివరి వరకు పోరాటం చేసి అనుకున్నది సాధిస్తారని మరో సారి నిరూపించారు. అమెరికాలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళను కంటికి రెప్పలా కాపాడుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చేవిధంగా చికిత్స అందించి అందరి దగ్గర ప్రశంసలు పొందారు.

 a brain-dead woman in the United States delivered to a baby.

అమెరికాలోని నెబ్రస్కా ప్రాంతంలో నివాసం ఉంటున్న కార్ల పిరేజ్ (22) అనే మహిళ చిన్నతనం నుండి మెదడు వ్యాధితో బాధపడుతున్నది. ఈమె 22 వారాల గర్బవతిగా ఉన్న సమయంలో ఒక్క సారిగా తల తిరిగి కిందపడిపోయారు. వెంటనే ఆమెను వైద్యులు వెంటిలేటర్ మీదకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 100 మంది డాక్టర్లు కార్లకు చికిత్స చేశారు.

54 రోజుల పాటు వెంటిలేర్ మీద కోమాలో ఉన్న కార్ల కడుపులో ఉన్న బిడ్డను సిజేరియన్ ద్వారా బయటకు తీశారు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తరువాత కార్ల మరణించింది. బిడ్డ పుట్టినప్పుడు 1.3 కేజీల బరువు ఉందని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. బిడ్డకు ఏంజిల్ అనే నామకరణం చేశారు. కార్ల కిడ్నీలు, కళ్లు, గుండెను దానం చేశారు.

1982 నుండి ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ అయిన 33 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలి పెట్టారు. 1999లో చివరి సారిగా బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ బిడ్డకు జన్మనిశ్చి కన్నుమూసింది. ఇప్పుడు 2015 మేలో మళ్లి ఇలాంటి సంఘటన వెలుగు చూసింది.

English summary
Karla Perez and her partner wanted a baby. But at 22 weeks pregnant, she suffered a brain bleed that left her brain dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X