వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రీగానే.: రియో ఒలింపిక్స్ కోసం 90లక్షల కండోమ్స్ సిద్ధం!

|
Google Oneindia TeluguNews

రియోడిజనిరో: వచ్చే ఆగస్టులో జరగనున్న ఒలింపిక్స్ సంరంభం కోసం బ్రెజిల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏర్పాట్లలో భాగంగా సురక్షితమైన శృంగారం కోసం 90లక్షల కండోమ్ లను కూడా సిద్ధ చేసింది. అంతేగాక, వీటిని ఉచితంగానే అందించనున్నారు.

ఆగస్టులో ప్రారంభమయ్యే ఈమెగా వేడుకకు వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు, ప్రముఖులతోపాటు వీక్షకులు రానున్నారు. కాగా, 4లక్షలా 50వేల కండోమ్ లను క్రీడాకారులు, సిబ్బందికి అందించనున్నారు. మిగితా మొత్తం వీక్షకులకు అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

Brazil to Hand Out 9 mn Condoms for Free During Rio Olympics

కండోమ్‌లను ప్రభుత్వానికి చెందిన నాటెక్స్ ఫ్యాక్టరీ సిద్ధం చేసినట్లు చెప్పారు. అమెజాన్ అడవిలో పెరిగే రబ్బరు చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు ఆయన వివరించారు.

ఒలింపిక్స్ అతిథుల భద్రతే తమకు ముఖ్యమని, అందులో భాగంగానే లైంగిక చర్యల వల్ల ఎవరూ హెచ్ఐవీ లాంటి వ్యాధులకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చాలా ఏళ్ల నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

English summary
Brazil's government will hand out 9 million condoms for free around Rio de Janeiro during the Olympics in August, a push meant to encourage safe sex and also defend the Amazon rainforest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X