వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఐసీయూ'లో ఫుట్ బాల్ లెజెండ్ పీలే... క్షేమంగా ఉన్నానని ట్వీట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Brazil legend Pele 'doing fine' in Sao Paulo hospital
న్యూఢిల్లీ: పుట్‌బాల్ లెజెండ్ పీలే(74) తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశాడు. పీలే మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ వ్యాధితో కారణంగా మూడు రోజుల క్రితం బ్రెజిల్ లోని సావోపాలోలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పీలే ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ.. సావుపాలో లోని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో నేను చికిత్స పొందుతున్నా. వ్యక్తిగత కారణంగా నేను ఆసుపత్రిలోని ఓ ప్రత్యేక రూంలో ఉంటున్నా. నన్ను చూడటానికి వస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు.

అభిమానుల అండతో నేను వ్యాధి నుంచి త్వరలోనే కోలుకుంటా. నేను ప్రశాంత వాతావరణంలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా. మీ ప్రేమాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.

రాబోయే కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నా. డిశ్చార్జీ అనంతరం దీనిని అమలుపరుస్తానని ఆయన పేర్కొన్నారు.

English summary
Brazil legend Pele has said he is "doing fine" after being transferred to a special care unit following treatment for a urinary infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X