వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మస్ట్ వాచ్ : క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం ద్వారా వైద్యసిబ్బందికి బ్రెజిల్ కృతజ్ఞతలు..వీడియో వైరల్..!

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్ : కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వేళ ప్రజలంతా తమను ఈ మహమ్మారి నుంచి గట్టెక్కించాలని భగవంతుడివైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారిపై పోరుకు వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ప్రస్తుతం వ్యాధి సోకిన వారికి వైద్యులే భగవంతుడిలా కనిపిస్తున్నారు. అంతేకాదు దేశాలన్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించాయి. ఇక వైద్యులకు వైద్య సిబ్బందికి ఎవరికి తోచినట్లుగా వారు తమ కృతజ్ఞతను తెలుపుతున్నారు. తాజాగా బ్రెజిల్‌లో ఒక అపురూపమైన దృశ్యం ప్రపంచాన్ని కనువిందు చేసింది.

వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు

ఈస్టర్ పర్వదినాన్ని బ్రెజిల్ దేశస్తులు వినూత్నంగా జరుపుకున్నారు. అయితే వారి ఇళ్లల్లోనే ఉండి వారు ఈస్టర్ సండేను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో భగవంతుడి స్థానంలో ఉండి సేవలందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపే భాగంలో అక్కడి ప్రఖ్యాత విగ్రహం క్రైస్ట్ ది రిడీమర్‌ను డాక్టర్ గెటప్‌లో వెలిగించారు. అంతేకాదు కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించిన దేశాలకు సంబంధించిన జెండాలు కూడా దర్శనమిచ్చాయి. ఇక క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం కింద నుంచి ఆర్క్ బిషప్ వాక్యాన్ని బోధించారు.

ప్రత్యేక ఆకర్షణగా క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం

ప్రత్యేక ఆకర్షణగా క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం

ఇక కృతజ్ఞతలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భాషల్లో చెప్పడం జరిగింది. అంతేకాదు విగ్రహం వద్ద మాస్కులు ధరించడం, స్క్రబ్‌లు ధరించి ఉన్న వైద్య సిబ్బంది ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కనువిందు చేశాయి. ఇక ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండండి అంటూ విగ్రహం చేతుల నుంచి వచ్చిన మెసేజ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక కరోనామహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఇలా రెండోసారి విగ్రహాన్ని వెలిగించడం విశేషం. గత నెలలో కరోనావైరస్ బారిన పడి అత్యధిక కేసులు నమోదైన దేశాలను విగ్రహం పై ప్రదర్శించడం జరిగింది.

 ఆర్థికంగా కుదేలైన బ్రెజిల్

ఆర్థికంగా కుదేలైన బ్రెజిల్


ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 22వేల పాజిటివ్ కోవిడ్ కేసులు నమోదు కాగా 1230 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ఈ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారో కన్నీటి పర్యంతమయ్యారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలంటూ ఆ దేశ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు కరోనావైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే బ్రెజిల్ మరింత నష్టపోతుందని ఆవేదనతో పాటు ఆందోళన ఆయన వ్యక్తం చేశారు.

English summary
Brazil's Christ the Redeemer statue was illuminated to look like a doctor on Easter Sunday, in a tribute to front-line healthcare workers battling the coronavirus pandemic around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X