వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చిలో వీధికుక్కలు... ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు..?

|
Google Oneindia TeluguNews

కుక్కలు పాపం నోరులేని జీవాలు. ఒక ముద్ద పెడితే ఎంతో విశ్వాసం చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసం చూపిస్తాయో వీధి కుక్కలు కూడా అంతే విశ్వాసం చూపిస్తాయి. బ్రెజిల్‌లో ఓ చర్చి పాస్టర్ సర్వీసుకు వీధికుక్కలను తీసుకొచ్చారు. ఇది చూసి ప్రార్థనకు హాజరైన భక్తులు అవాక్కయ్యారు. వీధి కుక్కలను చర్చిలోపలికి తీసుకురావడం ఏంటని విస్తుపోయారు. కానీ దీని వెనక అసలు కారణం మరొకటి ఉంది.

 వీధి కుక్కలను దత్తత తీసుకోవాలంటూ పాస్టర్ పిలుపు

వీధి కుక్కలను దత్తత తీసుకోవాలంటూ పాస్టర్ పిలుపు

బ్రెజిల్‌లోని గ్రవాటా ప్రాంతానికి చెందిన చర్చి పాస్టర్ జోవో అరాజో గోమెస్ చర్చిలోకి వీధికుక్కలను తీసుకొచ్చాడు. వీధికుక్కలు కూడా ప్రాణులే అని వాటిని గుర్తించాలని చెప్పారు. వాటిని దత్తత తీసుకోవాలంటూ భక్తులకు పిలుపునిచ్చారు. గ్రవాటాలోని పారిష్ ఆఫ్ సాంటనాకు హెడ్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫాదర్ గోమెస్... నోరులేని ఈ వీధి శునకాలను చూసి చలించిపోయారు. తిండి లేక ఉండేందుకు ఇంత చోటులేక అల్లాడిపోతున్న వాటిని చూసి అతని మనస్సు తరించుకుపోయిందని చెప్పారు. వీటికి ఎలాగైనా ఆశ్రయం కల్పించాలని తనతోపాటే చర్చిలోకి ఈ కుక్కలను తీసుకొచ్చారు ఫాదర్ గోమెస్.

వీధి కుక్కలను దత్తత తీసుకున్న చర్చి సభ్యులు

వీధి కుక్కలను దత్తత తీసుకున్న చర్చి సభ్యులు

ఇక చర్చిలోకి తీసుకురాగానే ఈ వీధికుక్కలను కొన్ని కుటుంబాలకు చూపించాడు. ఇష్టం వచ్చిన వారు ఆ కుక్కలను తమతో పాటు తమ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. మిగతా కుక్కలు ప్రతిరోజు చర్చి సర్వీసుకు ఫాదర్‌తో పాటే వస్తున్నాయి. వీటి కోసం కొన్ని చాక్లెట్లను కూడా తన వెంట తీసుకొస్తున్నాడు. ఇలా గత ఆరునెలల నుంచి కుక్కలు చర్చికి వస్తున్నాయి. ఈ వీధి కుక్కలు నచ్చిన వారు తమవెంటా వాటిని తీసుకెళుతున్నారు. ఈ వీధి కుక్కలకు ఎలాగైనా ఆశ్రయం కల్పించాలన్న తపనతో ప్రతిరోజూ తనతో పాటు కుక్కలను చర్చికి తీసుకొచ్చేవాడినని ఇప్పుడు తన కోరిక నెరవేరిందని చాలా కుక్కలను భక్తులు దత్తత తీసుకున్నట్లు ఫాదర్ చెప్పారు.

కుక్కల బాగోగుల బాధ్యత చర్చి తీసుకుంటుంది

కుక్కల బాగోగుల బాధ్యత చర్చి తీసుకుంటుంది

ఇక చర్చికి వచ్చినప్పుడల్లా ఆ కుక్కలు తనతో ఎంతో ప్రేమతో మసులుతాయని ఫాదర్ గోమెస్ చెప్పారు. కొన్ని సార్లు ఈ కుక్కలు హింసకు గురవుతుంటాయని చెప్పిన ఫాదర్ గోమెస్.. కొన్ని సార్లు అనారోగ్యం బారిన పడుతాయని చెప్పారు. ఆ సమయంలో కుక్కలను చర్చి ఆదుకుంటుందని వెల్లడించారు. ఇక సర్వీసు సమయంలో కుక్కలను ఎలా పరిరక్షించుకోవాలనే అంశంపై మాట్లాడుతామని ఫాదర్ గోమెస్ చెప్పారు. ఇక ఫాదర్ గోమెస్ చేపట్టిన ఈ క్యాంపెయిన్ మంచి ఫలితాలను ఇస్తోందని భక్తులు చెబుతున్నారు. గ్రవాటా ప్రాంతంలో వీధి కుక్కలు చాలా తక్కువైపోయాయని చెప్పారు. ఫాదర్ గోమెస్ స్వయంగా మూడు కుక్కలను అడాప్ట్ చేసుకున్నట్లు చర్చి సభ్యులు చెప్పారు.

English summary
A priest from Gravata, Brazil is trying hard to find homes for hundreds of stray dogs that roam about in the city.Now, Father João Paulo Araujo Gomes has stepped up his campaign by inviting the homeless canines to his church services just so people can adopt them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X