వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ప్రతిభ చూపారు: బ్రెజిల్లో సెక్స్‌వర్కర్స్ 'నేక్డ్ ఫుట్‌బాల్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రెజిల్‌లో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో ఫిఫా పోటీల నేపథ్యంలో వేశ్యలు ఇంగ్లీష్ పాఠాలు కూడా నేర్చుకున్నారు. బ్రెజిల్‌లో వ్యభిచారం చట్టబద్ధం. ఇందుకోసం ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకున్నారు. ఇదిలా ఉండగా ఫిఫా ప్రపంచ కప్ నేపథ్యంలో వ్యభిచారిణిలు తమ ఫుట్‌బాల్ ప్రతిభను చూపించారు.

అయితే వారు ఆ ప్రతిభను చూపించింది.. తమ హక్కుల కోసం. గ్రీసును కొలంబియన్స్ 3-0తో ఓడించిన నగరంలోనే సెక్స్ వర్కర్స్ ఫుట్‌బాల్ ఆడారు. తాము సెక్స్ వర్కర్లం అయినంత మాత్రాన ఎవరికీ తక్కువ కాదని, తమకు హక్కులు ఉంటాయని తెలిపేందుకు నిరసనగా ఈ ఫుట్‌బాల్ ఆడారు.

Brazil prostitues show ball skills

అందరికీ సమాన హక్కులు ఉండాలని వారు నినదించారు. బ్రెజిల్ సెక్స్ వర్కర్స్ చాలా ఏళ్లుగా తమకు అవమానం జరుగుతోందని, తమ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. తమ వృత్తిని ప్రపంచంలోనే పురాతన వృత్తిగా చూడాలని కోరుతున్నారు.

సెక్స్ వర్కర్స్ నేక్డ్ ఫుట్‌బాల్ క్లబ్ టీంగా ఏర్పడ్డారు. ఎవాంగ్లికల్స్ అనే గర్ల్స్ గ్రూప్‌తో ఆడారు. నేక్డ్ ఫుట్‌బాల్ టీంగా ఏర్పడినప్పటికీ ఇరు జట్లు పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులతో ఫుట్‌బాల్ ఆడాయి. ఈ సందర్భంగా ఎవాంగ్లికల్ జట్టు సభ్యురాలు ఒకరు మాట్లాడుతూ.. సెక్స్ వర్కర్స్ హక్కులను కూడా మనం మర్చిపోవద్దని అభిప్రాయపడ్డారు. సెక్స్ వర్కర్లతో ఫుట్‌బాల్ ఆడిన ఎవాంగ్లికల్స్ గ్రూప్ కూడా మ్యాచ్‌ని ఎంజాయ్ చేసింది.

English summary
Brazil prostitues show ball skills to highlight sex workers quo rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X