వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్​ పని తీరుపైనే ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు నుంచి సెకండ్​వేవ్​ ముప్పు ముంచుకోస్తొంది. చలికాలం కావడంతో నష్టం భారీగా ఉండొచ్చనే హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి టైంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక దేశాధ్యక్షుడు.. నిర్లక్ష్యమైన కామెంట్లు చేశాడు.

పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

 జగమొండి జైర్ బొల్సొనారో

జగమొండి జైర్ బొల్సొనారో

కరోనా వైరస్ విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో మొదటి నుంచే ఆలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడన్నది తెలిసిందే. కరోనా మరణాలు అమెరికా తర్వాత బ్రెజిల్​లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయినా కూడా బోల్సోనారో మొండి వైఖరిలో మార్పు రావట్లేదు. పైగా వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్స్​పై అన్నిదేశాలు తొందరపడుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. వ్యాకినేషన్​ మనుషుల కంటే తన కుక్కకు మాత్రమే అవసరం అంటూ ఆమధ్య వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు. అయితే మీడియా మాత్రం వ్యాక్సిన్​ విషయంలో మీడియా పదేపదే ఆయన్ని ప్రశ్నిస్తోంది. దీంతో బోల్సోనారో తన స్టైల్​లోనే ఆన్సర్​ ఇచ్చి.. జర్నలిస్టులకు షాక్​ ఇచ్చాడు.

 అది నా హక్కు

అది నా హక్కు

ఇంతకీ బోల్సోనారో ఏమన్నాడంటే.. ‘‘కోవిడ్19కి వ్యాక్సిన్​ వచ్చినా.. నేను మాత్రం తీసుకోను. ​ఎందుకంటే అది నా హక్కు. నేను మీకు(జర్నలిస్టులకు) ఇదే చెప్పదల్చుకున్నా. అలాగే మా బ్రెజిల్ జనాలకి కూడా కరోనా టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇవ్వనివ్వను కూడా. మాస్కులతో ఏదో ఒరుగుతుందని అనుకుంటున్నారు. కరోనా వ్యాప్తి ఆగుతుందని అంటున్నారు. కానీ, అందుకు సరైన ఆధారాలు ఎక్కడున్నాయి?. అలాంటప్పుడు మాస్కులు వేసుకోవడం ఎందుకు?'' అన్నాడు. దీంతో బిత్తరపోవడం జర్నలిస్టుల వంతు అయ్యింది. మరోవైపు బోల్సోనారో నిర్లక్ష్యంగా ఇచ్చిన స్టేట్మెంట్ మీద పలువురు మేధావులు మండిపడుతున్నారు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని బోల్సోనారోకి సూచిస్తున్నారు.

మాస్క్​ పీకేసి..

మాస్క్​ పీకేసి..

కరోనా విషయంలో బోల్సోనారో ఇలా మాట్లాడడం కొత్తేంకాదు. వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ఇంతకు ముందు ఒకసారి స్పందిస్తూ.. ‘ప్రపంచం మొత్తం వ్యాక్సిన్​ విషయంలో ముందున్నా.. బ్రెజిల్ మాత్రం దూరంగా ఉంటుందని' అన్నాడు. జూలైలో బోల్సోనారోకి కరోనా సోకింది. ఆ టైంలోనూ కరోనా తీవ్రత తమ దేశంలో పెద్దగా లేదని కామెంట్లు చేశాడు. పైగా జర్నలిస్టుల ముందు మాస్క్​ తీసేసి తనకి కరోనా సోకిందని ప్రకటించడంతో.. వాళ్లంతా భయపడిపోయారు.

 తగ్గినట్లే తగ్గి..

తగ్గినట్లే తగ్గి..

సౌత్​ అమెరికా దేశమైన బ్రెజిల్​లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల్లో మూడో ప్లేసులో, మరణాల్లో రెండో ప్లేసులో కొనసాగుతోంది. మధ్యలో కేసులు తగ్గినట్లు అనిపించినప్పటికీ.. ఒక్కసారిగా పెరగడం మొదలైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37వేల పైచిలుకు కేసులు, 691 మరణాలు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ కేసుల సంఖ్య 6.20లక్షలకు, మరణాల సంఖ్య 1.71లక్షలకు పెరిగాయి. గ్లోబల్ గా శుక్రవారం నాటికి కొవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.1కోట్లు దాటింది. మరణాల సంఖ్య 15 లక్షలకు చేరువైంది.

Recommended Video

COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

#BoycottFood:టాప్​ట్రెండింగ్ - రైతులతో లింకేంటి​? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..#BoycottFood:టాప్​ట్రెండింగ్ - రైతులతో లింకేంటి​? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..

English summary
Brazilian President Jair Bolsonaro said on Thursday evening that he will not take a coronavirus vaccine, the latest in a series of statements he has made expressing skepticism toward coronavirus vaccination programs, news agency Reuters reported on Friday. In statements broadcast live over multiple social media platforms, the right-wing leader added that Congress was unlikely to require Brazilians to take a vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X