వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలంపిక్స్ క్రీడల్లో ‘బ్రేక్ డాన్స్’.. 2024 పారిస్ పోటీలకు అర్హత - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జపనీస్ బ్రేక్ డాన్సర్

పారిస్‌లో 2024లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో 'బ్రేకింగ్' (బ్రేక్ డాన్స్ లో ఒక తరహా నాట్యం) అనే డాన్స్ క్రీడకు చోటు దక్కింది.

2020లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో 2021లో టోక్యోలో జరగనున్న క్రీడల్లో సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, క్లైమ్బింగ్‌లను కూడా కొత్తగా చేర్చారు. ఇవి 2024లో కూడా కొనసాగుతాయి.

అయితే, 2024లో జరగనున్న ఒలింపిక్స్ లో పార్కర్ గేమ్ కి చోటు దక్కలేదు. ఈ గల్లీ క్రీడలో సాధారణంగా పరుగు పెట్టడం, గెంతడం, అవాంతరాలను దాటుకుంటూ క్లైమ్బింగ్ చేయడం లాంటివి ఉంటాయి.

"ఈ పోటీలో చోటు దక్కడం వలన బ్రేకింగ్ కి ఒక క్రీడగా గుర్తింపు వస్తుంది" అని బ్రిటిష్ బ్రేక్ డాన్సర్ కరం సింగ్ బీబీసీ స్పోర్ట్ కి చెప్పారు. "ఒలింపిక్స్ లో సంప్రదాయ క్రీడలను అనుసరించని యువత ఇక ముందు క్రీడలు చూసేలా బ్రేకింగ్ ఆకర్షిస్తుంది" అని ఆయన అన్నారు.

స్క్వాష్, బిలియర్డ్స్, చెస్ గేమ్స్ కి ఒలింపిక్స్ లో చోటు లభించలేదు.

బ్రేకింగ్ లో కళాత్మకత, క్రీడా తత్పరత సమ్మిళితం అవ్వడంతో పాటు పోటీదారుని నాట్య కదలికలు, పద విన్యాసం, నాట్యంలో శక్తివంతమైన కదలికలు, స్తంభనలు ఉంటాయి.

క్రీడాకారుడు శక్తివంతమైన కదలికలు చేసేటప్పుడు శరీరం వేగంగా ఊగగా, ఏదైనా ఒక ప్రత్యేక భంగిమలో కొన్ని క్షణాల పాటు ఉన్నప్పుడు ఆ క్షణం స్తంభిస్తుంది.

ఈ పోటీలో పాల్గొనే వారిని బి-బాయ్స్ - బి- గర్ల్స్ గా పిలుస్తారు.

వీరి గెలుపును కేవలం సాంకేతిక నైపుణ్యం ఆధారంగా కాకుండా, వారి హావభావాలు, కళాత్మకత, నాట్యాన్ని ఎంత శక్తివంతంగా, వేగంగా , తాళానికి అనుగుణంగా, సునాయాసంగా ప్రదర్శిస్తున్నారో అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయిస్తారు.

బ్రేకింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, క్లైమ్బింగ్ లను ఒలింపిక్స్ లో చేర్చాలని 2024 పారిస్ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సరం ప్రతిపాదించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Break dance at Paris Olympics 2024
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X