వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బ్రెగ్జిట్' కొత్త ట్విస్ట్‌లు, త్వరగా వెళ్లిపోండని బ్రిటన్‌కు ఈయూ

|
Google Oneindia TeluguNews

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి విడిపోదామంటూ రెఫరెండం తీర్పు వెల్లడి కావడాన్ని జీర్ణించుకోలేని పలువురు బ్రిటన ఓటర్లు మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విలియం ఒలివర్ హేలి అనే వ్యక్తి రూపొందించిన విజ్ఞాపన పత్రానికి నెట్లో 20లక్షల మంది మద్దతిచ్చారు.

కేవలం 75 శాతం మంది మాత్రమే ఓట్లు వేయడం, కూటమిలో ఉండాలని, వద్దన్న వారి మధ్య తేడా చాలా తక్కువగా ఉండటంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన లండన్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, మాంచెస్టర్ ప్రాంత వాసుల్లో అత్యధికులు దీనిపై సంతకం చేశారు.

 Brexit: EU push for UK to leave 'as soon as possible'

ఇక త్వరగా వెళ్లిపోండి

ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రజల కోరిక మేరకు బ్రిటన్ వీలైనంత త్వరగా కూటమిని వీడాలని మిగతా సభ్య దేశాలు సూచించాయి. ఈయూ ఫౌండేషన్ దేశాలుగా ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు సమావేశమై తాజా పరిస్థితులను చర్చించారు.

డేవిడ్ కామెరూన్ రాజీనామా నేపథ్యంలో కొత్త ప్రధాని మిగతా ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కామెరూన్ త్వరగా కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించాలన్నారు. యూనియన్ నుంచి తప్పుకునేందుకు క్లిష్టంగా ఉన్న నిబంధనలను సరళతరం చేయడంపై వీరు చర్చించారు. బ్రిటన్ వెళ్లిపోయినా యూనియన్‌కు నష్టం లేదన్నారు.

బ్రిటన్ వీడిన తర్వాత యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. విడిపోయేందుకు లేఖను పంపించేందుు అక్టోబర్‌ వరకూ ఆగాలని బ్రిటీష్‌ ప్రభుత్వం ఎందుకు భావిస్తుందో తనకు అర్థం కావటం లేదని, తెగదెంపులు తక్షణం జరగాలని నేను కోరుకుంటున్నానని ఈయూ కార్యవర్గసంఘం అధ్యక్షుడు జీన్‌-క్లాడ్‌ జంకర్‌ పేర్కొన్నారు.

ఈయూలోనే ఉంటాం: స్కాట్లాండ్

ఈయూ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నప్పటికీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ బ్రిటన్‌లో (యూకే) భాగంగా ఉన్న స్కాట్లాండ్‌ మాత్రం ససేమిరా అంటోంది. ఈయూలో తమ సభ్యత్వాన్ని కొనసాగించుకుంటామని చెబుతోంది.

ఈయూలో కొనసాగటం కోసం అవసరమైతే బ్రిటన్‌ నుంచి తెగదెంపులు చేసుకుంటామని, దీనికోసం మరోసారి రెఫరెండం జరిపే అవకాశం కూడా ఉందని స్కాట్లాండ్‌ ప్రభుత్వ అధినాయకురాలు (ఫస్ట్‌ మినిస్టర్‌) నికోలా స్టుర్జియాన్ శనివారం తెలిపారు. 2014లో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో యూకేతో కలిసి ఉండటానికే అత్యధిక స్కాట్లాండ్‌‌వాసులు మద్దతు పలికారు. ఇప్పుడు ఓటింగ్ జరిగితే విడిపయేందుకు మొగ్గుచూపుతారని అంటున్నారు.

English summary
EU push for UK to leave 'as soon as possible'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X