• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా జిన్‌పింగ్‌తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీప

|

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. భీకరమైన చలికాలంలోనూ యుద్ధానికి సిద్ధమని రెండు దేశాల సైన్యాధికారులు పోటాపోటీ ప్రకటనలు చేశారు.. అయితే దేశాల అధినేతలు మాత్రం ఏమాత్రం టెంపర్ కోల్పోకుండా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చైనా సరిహద్దులో టెన్షన్ వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ ఈ నెలలో రెండోసారి ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారు.

  PM Modi, Xi Jinping At 12th BRICS Summit జిన్ పింగ్ ఎదురుగానే మోదీ చైనా తీరును ఉతికారేశారు..!!

  జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

   బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సు

  బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సు

  బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి 12వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో తన సందేశాన్ని వినిపించారు. ఆ సమయంలో మిగతా నాలుగు దేశాల అధినేతలు కూడా ఫేస్ టైమ్ లో పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సును రష్యా నిర్వహిస్తున్నది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చేసింది 10 నిమిషాల ప్రసంగమే అయినా.. టెర్రరిజం మొదలుకొని కొవిడ్ అనంతర పరిణామాల దాకా దాదాపు అన్ని అంశాలను మోదీ ప్రస్తావించారు.

   చైనా చీఫ్ ఎదురుగానే ఖండనలు..

  చైనా చీఫ్ ఎదురుగానే ఖండనలు..

  టెర్రరిస్టుల కార్ఖానా పాకిస్తాన్ కు చైనా అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో.. జిన్ పిన్ ఎదురుగానే మోదీ టెర్రర్ దేశాల తీరును ఉతికిఆరేశారు. ‘‘గౌరవనీయులైన పుతిన్.. యువర్ ఎక్సలెన్సీ జిన్ పింగ్.. రెస్పెక్టెడ్ రమఫొసా.. ఘనతవహించిన బొల్సనారో.. మీ అందరితో కలిసి ఇవాళ కీలకమైన బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉంది'' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ప‌్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య ఉగ్ర‌వాద‌మేన‌ని, ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న దేశాల‌ను అదుపుచేస్తే స‌మ‌స్య సంస్థాగ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని గట్టిగా చెప్పారు. మరో విపత్తు..

   ఆత్మనిర్భర్‌తో అవకాశాలు..

  ఆత్మనిర్భర్‌తో అవకాశాలు..

  టెర్రరిజానికి సహకరిస్తున్న దేశాలపై చర్యలు ఉండాల్సిందేన్న భారత ప్రధాని.. ప్రస్తుతం ప్రంపంచం ఎదుర్కొంటున్న మరో విపత్తు కొవిడ్-19 గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా అనంతర పరిస్థితుల్ని చక్కదిద్దడంలో బ్రిక్స్ దేశాలు మెరుగ్గా పనిచేస్తున్నాయన్నారు. ఇండియాకు సంబంధించి కరోనా విపత్తు నుంచి బయటపడేలా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో సమగ్ర సంస్కరణ ప్రక్రియ చేపట్టామని, కొవిడ్ అనంత‌రం ఇండియాను అన్ని విధాలుగా బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఈ ప్రక్రియలో విదేశీ సంస్థలకు కూడా భారీగా అవకాశాలు కల్పిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. కరోనా సమయంలో భారత్..150 దేశాల‌కు అత్య‌వ‌స‌ర ఔష‌ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసిందని, అది భార‌త దేశ‌పు ఫార్మా ప‌రిశ్ర‌మ స‌మ‌ర్థ‌త‌ను చాటి చెప్పింద‌ని తెలిపారు. అదే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా కొన‌సాగుతుంద‌ని అన్నారు.

   ప్రపంచ సంస్థల తీరు మారాలి..

  ప్రపంచ సంస్థల తీరు మారాలి..

  ఐక్యారాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా గత నెలలో ప్రసంగించిన మోదీ.. భారత్ పట్ల ఐరాస చిన్నచూపు చూడటాన్ని ఎండగట్టడం తెలిసిందే. ఇప్పుడు బ్రిక్స్ సదస్సు వేదికగానూ ఆయన.. ప్రపంచ సంస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు కురిపించారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో భారత్‌కు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు బ్రిక్స్ దేశాలు తమవంతు సహకారం అందిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు రావాల్సిందేనని, ఎంఎంఎఫ్, డబ్ల్యూటీవో లాంటి సంస్థల తీరులోనూ మార్పులు అనివార్యమని మోదీ అభిప్రాయపడ్డారు.

  వచ్చేఏడాది భారత్‌లో బ్రిక్స్

  వచ్చేఏడాది భారత్‌లో బ్రిక్స్

  కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బ్రిక్స్ (12వ) శిఖరాగ్ర సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. రష్యా ఆతిత్యమిస్తోన్న ఈ సమావేశాల్లో.. గ్లోబల్ స్టెబిలిటీ, షేర్‌డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్, టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేయడంపై, ట్రేడ్, హెల్త్, ఎనర్జీ వంటి అంశాలపై ఐదు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. సోమవారం బ్రిక్స్ దేశాల అధినేతలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోగా, సైడ్ లైన్ లో పలు శాఖల మంత్రులు, అధికారులు ఆయా వ్యవహారాలపై చర్చలు జరుపుతున్నారు. వచ్చేఏడాది బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2021నాటికి బ్రిక్స్ ఏర్పాటై 15 ఏండ్లు పూర్త‌వుతుంద‌ని, అప్ప‌టిక‌ల్లా గ‌త స‌ద‌స్సుల్లో తీసుకున్న నిర్ణ‌యాలు, వాటి అమలుకు సంబంధించిన వివ‌రాల‌తో నివేదిక రూపొందించుకుందామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  జగన్ సిగ్గుపడుతున్నారు -నిమ్మగడ్డకు వైసీపీ కాన్సెంట్ -అకౌంట్లలోకి డబ్బులు: ఎంపీ రఘురామ

  English summary
  Prime Minister Narendra Modi, addressing a virtual summit of the influential grouping BRICS Summit 2020, said nations supporting terrorism should be called and that such countries should be "brought to the book". he also spoke about about economic recovery after COVID-19. PM Modi, china president Xi came face to face for second time this month.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X