వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, మత పెద్ద సహా 50 మంది అరెస్ట్, రూ.4100 ఫైన్..

|
Google Oneindia TeluguNews

కరోనా విలయంతో కూడా ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. సామాజిక దూరం పాటించండి అని ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకుంటోన్న పట్టించుకోవడం లేదు. దక్షిణాఫ్రికాలో అయితే ఓ జంట వివాహాం కూడా చేసుకునే ప్రయత్నించింది. మత పెద్ద సహా 50 మంది గుమికూడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తుపాకీ చేతపట్టి మరీ బెదిరించారు. అందరినీ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో సౌతాఫ్రికాలో రెండోవారం లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెండోవారం విధించిన లాక్ డౌన్ ఈ నెల 16వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అయితే ఆదివారం క్వాజలు నాటాల్‌లో పెళ్లికొడుకు జబులని జులు, పెళ్లి కూతురు నొమాండజో మైజ్ పెళ్లి చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. వధూవరులు సహా మత పెద్ద, 50 మంది గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. తుపాకీలు చేతబట్టి వారందరినీ అరెస్ట్ చేశారు.

Bride, Groom And 50 Guests Arrest..

వివాహా వేదిక క్వాజలు నాటాల్‌లో నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ ఎలా గుమిగూడారని ప్రశ్నించారు. వైరస్ ప్రబలుతుంటే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారా అని ఫైరయ్యారు. ఒక్కొక్కరికి రూ.4100 చొప్పున ఫైన్ చేశారు. సౌతాఫ్రికాలో 1700 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.

English summary
Bride, Groom And 50 Guests Arrested For Holding Wedding During Lockdown in south africa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X