వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు ఆపలేవు: మోకాలి లోతు బురదనీటిలోకి దిగి పెళ్లి చేసుకున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, ఎన్నో ఇళ్లు జలమయమయ్యాయి. ఇలాంటి సమయంలో ఓ జంట పెళ్లి పెట్టుకుంది. అంత వరదల్లోను పెళ్లి చేసుకున్నారు.

జెఫ్ఫర్సన్, జోబెల్ ఆగస్ట్ 13వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వర్షాల కారణంగా వారి పెళ్లి జరగాల్సిన ప్రార్థనా స్థలం మొత్తం నీటితో నిండిపోయింది. అయినప్పటికీ వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

Bride wades up the aisle during Philippines flood

మోకాలి లోతు నీళ్లలోకి దిగి వారు పెళ్లి చేసుకున్నారు. వధువు జోబెల్ తన తెల్లటి గౌను మురికిగా మారినా పట్టించుకోలేదు. ఓడలో ఇరువురు ప్రార్థనా మందిరంలోకి చేరుకొని, పెళ్లి చేసుకున్నారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వర్షాలు, వరదలు వచ్చినా తమ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరని, పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, ప్రతి సంవత్సరం పడే వర్షాల కారణంగా పెళ్లిని ఎందుకు వాయిదా వేయాలని, ప్రేమించిన వ్యక్తిని అనుకున్న సమయానికి పెళ్లి చేసుకున్నానని వధువు చెప్పారు. నీటిలో నడుస్తున్నప్పుడు తన గౌను తడిసినప్పటికీ తనకు ఎర్ర తివాచీపై నడుస్తున్నంత హాయిగా అనిపించిందన్నారు.

English summary
A bride refused to let the weather ruin her wedding plans as she gracefully made her way down a flooded church aisle to join her groom-to be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X