వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 దేశాలకు బ్రిటన్ స్ట్రెయిన్.. సౌతాఫ్రికా వైరస్ 23 దేశాలకు వ్యాప్తి..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ టెన్షన్ పుట్టిస్తోంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న స్ట్రెయిన్ మన దేశానికీ విస్తరించింది. భారత్, అమెరికాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా తాకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ పై బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్నిపేర్కొంది. గత వారంలో 10 దేశాలకు అది వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇటు దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. అంతకుముందటి వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని పేర్కొంది. మరణాలు మాత్రం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలో 93 వేల మంది కరోనాకు బలయ్యారని, అంతకుముందు వారంతో పోలిస్తే అది 9 శాతం అధికమని పేర్కొంది. ప్రపంచమంతా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని పేర్కొంది.

britain corona strain spread 60 countries

స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

English summary
britain corona strain spread 60 countries and south africa strain spread 23 countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X