• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈయూ నుంచి వైదొలిగిన బ్రిటన్: నవశకానికి నాంది అంటోన్న మద్దతుదారులు, పార్లమెంట్ వద్ద సంబరాలు

|

ఎట్టకేలకు యూరొపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈయూ నుంచి వైదొలిగి స్వతంత్ర దేశంగా అవతరించింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఆవిర్భవించిన ఈయూలో బ్రిటన్ దాదాపు 47 ఏళ్లపాటు సభ్యత్వం కలిగి ఉంది. కానీ ఈయూలో ఉండటంతో బ్రిటన్ అభివృద్ధి వెనకబడిపోతుందని భావించి నుంచి బయటకొచ్చింది. దీనికి సంబంధించి 2016 జూన్ 23న బ్రిటన్‌లో రెఫరెండం నిర్వహించగా 51.9 శాతం వైదొలగడానికి అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ కొనసాగింది. 2019 మార్చి 29 నుంచి ఈయూ వైదొలగాలి. అయితే ఈయూకు చెందిన 27 సభ్యదేశాలు కూడా ఆమోదం తెలిపేందుకు దాదాపు మరో ఏడాది సమయం పట్టింది.

సంబరాలు..

సంబరాలు..

యూరొపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా వైదొలగడంతో పార్లమెంట్ వద్ద బ్రెగ్జిట్ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. కొందరు తమ రాణిని దేవుడు రక్షించారని పాట పాడగా, మరికొందరు బాణాసంచా కాల్చి ఆనందోత్సవంలో తేలియాడారు. యుద్ధం ముగిసింది, మేం విజయం సాధించామని లీవ్ ప్రచారకర్త నిగెల్ ఫరాజ్ పేర్కొన్నారు. ఆధునిక బ్రిటన్ చరిత్రలో ఇది గొప్ప పరిణామంగా ఆయన అభివర్ణించారు.

అనుకూలం-ప్రతికూలం

అనుకూలం-ప్రతికూలం

ఈయూలో 27 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో శక్తిమంతమైన జర్మనీ, ఫ్రెంచ్‌లు భాగస్వామ్యులు. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మెక్రెన్ మాత్రం ఈయూ నుంచి బ్రిటన్ వెళ్లడం చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. దీంతో బ్రిటన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. మరోవైపు ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం స్వాగతించారు. బ్రస్సెల్ దౌర్జన్యం నుంచి తప్పించుకోవాలని బ్రిటన్ చూస్తోందని, అందుకే బయటకు వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపే పేర్కొన్నారు. మరోవైపు బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయంలో బ్రిటన్ జెండాను తొలగించారు.

ఎందుకంటే..

ఎందుకంటే..

యూరొపియన్ యూనియన్‌లో 27 సభ్యదేశాలు ఉన్నాయి. ఈయూలో ఉన్న దేశాలకు వీసా అవసరం లేకుండా స్వేచ్చగా తిరగొచ్చు. దీంతోపాటు అభివృద్ధిలో వెనకబడిపోతున్నామని భావించింది. వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తోన్నారని, సభ్యత్వ రుసుం పేరుతో ఏటా వందల కోట్ల డాలర్లు వసూల్ చేస్తున్నారని పేర్కొన్నది. అందుకు తమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని.. అయినా తాము ఎందుకు కొనసాగాలని భావించే బ్రిటన్ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకు బ్రిటన్‌లో ఈయూ చట్టాలే అమలయ్యేవి. ఈయూ నుంచి వైదొలగడంతో బ్రిటన్ కొత్త చట్టాలను రూపొందించుకొని, తమ దేశంలోకి వలసలను నియంత్రించే అవకాశం ఉంది. ఈయూ ఏర్పడిందే వాణిజ్య, రాజకీయ సహకారం కోసం, కానీ ఈయూలో ఉంటే తమ అభివృద్ధి నిలిచిపోతుందని బ్రిటన్ భావిస్తోంది.

English summary
United Kingdom finally cast off from the European Union on Friday for an uncertain future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X