వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు: విజయం దిశగా కన్జర్వేటివ్ పార్టీ.. తిరిగి ప్రధానిగా బోరిస్ జాన్సన్

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రెగ్జిట్ రెఫరెండంగా సాగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 650 సీట్లకుగాను 326 సీట్లలో విజయం సాధించిందని విదేశీ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కన్జర్వేటివ్ పార్టీకి వచ్చినట్లయ్యింది. ఇంకా ఫలితాలు వస్తున్నట్లు సమాచారం.

ఇక కన్జర్వేటివ్ పార్టీకి మెజార్టీ వచ్చిందంటే వచ్చే ఏడాది జనవరిలో యూకే యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గురువారం వెలువడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ 368 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి.

Britain Parliamentary Elections:Boris Johnson conservative party gets majority

కౌంటింగ్ ప్రారంభం కాగానే లేబర్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో తొలిసారిగా కన్జర్వేటివ్ పార్టీ పాగా వేసింది. బ్రెగ్జిట్‌ తప్పకుండా అమలు కావాలంటూ ఓటర్లు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే లేబర్ పార్టీకి 199 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.

ఇక లేబర్ పార్టీ వరసగా నాలుగో సారి ఓటమిపాలైనట్లయ్యింది. 1987లో మార్గరెట్ థాచర్ నేతృత్వంలో విజయం సాధించాక మళ్లీ ఆ స్థాయిలో కన్జర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక ఈ ఘన విజయంతో బ్రెగ్జిట్‌పై క్లియర్ స్టాండ్ తీసుకునే అవకాశం బోరిస్ జాన్సన్‌కు దక్కినట్లయ్యింది.

English summary
Britain's Prime Minister Boris Johnson on Friday won a parliamentary majority, according to Sky News and BBC television, after a snap election called over Brexit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X