వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు మరో షాక్: ఉ.కొరియాపై యుద్ధానికి బ్రిటన్ సిద్ధం, రంగంలోకి ‘క్వీన్ ఎలిజబెత్’

|
Google Oneindia TeluguNews

లండన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఉత్తర కొరియాపై యుద్ధానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరకొరియాతో యుద్ధంలోకి దిగేందుకు బ్రిటన్‌ సమాయత్తమైనట్లు రిపోర్టులు వస్తున్నాయి.

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య యుద్ధ వాతావారణం రోజు రోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో బ్రిటన్‌ కూడా యుద్ధానికి ఆయుధ సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బ్రిటన్‌ తన సరికొత్త విమాన వాహక నౌక హెచ్‌ఎంఎస్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.

 Britain ‘preparing for war with North Korea’

తమ వద్ద టైప్‌-45 డెస్ట్రాయర్లు, టైప్‌-23 ఫ్రిగేట్స్‌ ఉన్నా.. అత్యవసరమైతే క్వీన్‌ ఎలిజబెత్‌ను కూడా రంగంలోకి దించుతామని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆఖర్లో క్వీన్‌ ఎలిజబెత్‌ను నేవీకి అప్పగించనున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు మాటల యుద్ధానికి తెర దించకపోతుండటమే బ్రిటన్‌ యుద్ధానికి సిద్ధం కావడానికి కారణమని చెప్పారు.

English summary
British defence officials have reportedly been instructed to draw up plans in preparation for potential conflict with North Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X