వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో అద్భుతం: స్త్రీగా మారిన ఐదువేల ఏళ్లనాటి చెట్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బ్రిటన్‌లోనే అతి పురాతనమైన ఓ వృక్షం తనంతతానుగా లింగమార్పిడికి లోనవుతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు ఐదువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫార్టింగాల్ య్యూ వృక్షం పురషుడి నుంచి స్త్రీగా పరిణామం చెందుతుంది.

రాతియుగం కంటే అతి పురాతనమైన పెర్త్ షైర్ లోని ఈ వృక్షం పుప్పొడిని వెదజల్లుతూ ఉండేది. దీంతో దీనిని పురుష జాతికి చెందిన వృక్షంగా ఇన్నాళ్లు పరిశోధకులు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఇటీవల స్త్రీ జాతి చెట్టు మాదిరిగా ఫార్టింగాల్ య్యూ కూడా విత్తనాలకు ఉపయోగపడే రెడ్ బెర్రీస్ గుత్తులను కాయడం మొదలుపెట్టింది.

ఫార్టింగాల్ య్యూ వృక్షంలోని ఓ కొమ్మకు ఈ మధ్యనే మూడు రెడ్ బెర్రీస్ గుత్తులను వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినిబట్టి చెట్టులోని కొంతభాగం స్త్రీజాతిగా మారిందని నిర్ధారణకు వచ్చారు.

Britain's oldest tree, the Fortingall Yew, is 'undergoing a sex change'

'య్యూలు మాములుగా పురుష లేదా స్త్రీ జాతి చెట్లుగా ఉండి చలికాలంలో సులువుగా లైంగికోత్పత్తిలో పాల్గొంటాయి. మగజాతి చెట్లు గుండ్రని ఆకృతిలో ఉండి పుప్పొడిని వెదజల్లుతుంటాయి. వాటి ఆధారంగా శరత్కాలం, చలికాలంలో స్త్రీ జాతి య్యూ చెట్లు రెడ్ బెర్రీస్‌ను కాస్తాయి' అని రాయల్ బొటానిక్ గార్డెన్ ఎడిన్ బర్గ్ కు చెందిన శాస్త్రవేత్త మాక్స్ కొలెమన్ తెలిపారు.

'అయితే, ఫార్టింగాల్ య్యూకు అక్టోబర్‌లో మూడు రెడ్ బెర్రీస్ గుత్తులు కాయడం నన్ను ఆశ్చర్యపరిచింది. చెట్టు మొత్తం మగజాతిగానే ఉండగా ఒక కొమ్మకు మాత్రమే కాశాయి. ఇది చాలా విచిత్రం. య్యూలు, ఇతర శంఖాకార వృక్షాలు ఇలా స్వయంగా లింగమార్పిడికి లోనవ్వడంలో గతంలో ఎప్పుడూ వినలేదు' అని ఆయన వివరించారు.

య్యూ చెట్టుకు వెలుపలిభాగంలో కాసిన ఒక కొమ్మ మాత్రమే ఇలా స్త్రీజాతిగా పరిణామం చెంది రెడ్ బెర్రీస్‌ను కాస్తున్నదని ఆయన వివరించారు. ఈ మూడు రెడ్ బెర్రిస్‌ను చెట్టు నుంచి స్వాధీనం తీసుకుని యారప్‌లో ఉన్న య్యూ చెట్టులపై ఒక ప్రాజెక్టుగా చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
The oldest tree in Britain is undergoing a sex change after 5,000 years, according to botanists. Perthshire’s Fortingall Yew, estimated to be around 5,000 years old making it older than Stonehenge, is considered male as it produces pollen, as opposed to female yews which bear red seed-holding berries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X