వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలానికి బ్రిటన్ రాణి ప్రేమ లేఖ

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల అరుదైన ప్రేమ లేఖ వేలం వేయనున్నారు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్ కు రాసిన అరుదైన లేఖను ఇదే నెల 23వ తేదిన లండన్ లో వేలం వేయనున్నారు.

Britains Queen Elizabeth and King Philips fell in Love

రెండు పేజీలున్న ఈ లేఖలో రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ఎలా ప్రేమలో పడ్డారో ఆమె (రాణి ఎలిజబెత్) రచయితకు వివరించారు. 1947 లో ఫిలిప్, ఎలిజబెత్ ల వివాహానికి కొద్ది రోజుల ముందు ఈ లేఖను ఆమె రాశారు.

ప్రసిద్ది చెందిన పురాతన వస్తువులు, ఆభరణాలతో పాటు విలువైన సామాగ్రిని లండన్ లో వేలం వేయడం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ప్రేమ లేఖను ఎవరు సొంతం చేసుకుంటారు అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

English summary
A rare letter in which Queen Elizabeth II has talked about how she and husband Prince Philip fell in love will go under the hammer in the UK next wee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X