వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణీకులకు వింత అనుభవం..దిమ్మదిరిగే షాకిచ్చిన బ్రిటీష్ ఎయిర్‌వేస్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రయాణీకులకు వింత అనుభవం..దిమ్మదిరిగే షాకిచ్చిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ | Oneindia Telugu

లండన్ : బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురైంది. లండన్ నుంచి జర్మనీకి టెకాఫ్ తీసుకున్న విమానం కాస్తా స్కాట్లాండ్‌లో ల్యాండైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

అసలేం జరిగిందంటే?

లండన్‌లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ తరఫున డబ్ల్యూడీఎల్ ఏవియేషన్ సేవలందిస్తోంది. విమానాల రాకపోకలకు సంబంధించిన వ్యవహరాలను ఈ కంపెనీయే చూసుకుంటుంది. సోమవారం బీఏ 3271 నెంబర్ గల ఫ్లైట్ లండన్ నుంచి జర్మనీలోని డసుల్‌ఫోర్డ్‌కు టేకాఫ్ తీసుకుంది. అయితే డబ్ల్యూడీఎల్ కంపెనీ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా పైలట్, ఇతర సిబ్బందితో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఫ్లైట్ డెస్టినేషన్ స్కాట్లాండ్ అని ఉన్న డాక్యుమెంటు అందాయి. వాటి ఆధారంగా సిబ్బంది విమానాన్ని స్కాట్లాండ్ రాజధాని ఈడెన్‌బర్గ్‌లో ల్యాండ్ చేశారు.

 స్కాట్లాండ్ చేరాక తప్పు తెలుసుకున్న సిబ్బంది

స్కాట్లాండ్ చేరాక తప్పు తెలుసుకున్న సిబ్బంది

విమానం ల్యాండయ్యే సమయంలో క్యాబిన్ క్రూ ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణీకులకు దిమ్మదిరిగింది. జర్మనీకి వెళ్లాల్సిన తాము దానికి 520 మైళ్ల దూరంలోని స్కాట్లాండ్ కు చేరుకున్నామని తెలుసుకుని షాకయ్యారు. విమానయాన సంస్థ చేసిన తప్పు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్యాసింజర్లలో కొందరు అత్యవసర పనులపై జర్మనీకి వెళ్లాల్సినవారు ఉన్నారు. వారంతా సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం విమానం మళ్లీ జర్మనీకి బయలుదేరడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

అసలు సిసలు బలపరీక్ష: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నీ: గెలిస్తే రూ. వేలల్లో బహుమతులుఅసలు సిసలు బలపరీక్ష: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నీ: గెలిస్తే రూ. వేలల్లో బహుమతులు

క్షమాపణ కోరిన బ్రిటీష్ ఎయిర్‌వేస్

క్షమాపణ కోరిన బ్రిటీష్ ఎయిర్‌వేస్

విమానం జర్మనీకి బదులుగా స్కాట్లాండ్ చేరుకోవడంపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ స్పందించింది. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరింది. డబ్ల్యూడీఎల్ ఏవియేషన్ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రయాణీకులందరికీ వ్యక్తిగతంగా క్షమాపణ కోరుతూ సంజాయిషీ ఇచ్చుకుంది.

English summary
Passengers on a British Airways flight from London to Düsseldorf, Germany, were left bewildered on Monday when their plane landed in Scotland by mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X