విమానం కాక్‌పిట్‌లో దుస్తులు విప్పి..
లండన్: భూమికి 38,000 అడుగుల ఎత్తులో ఓ పైలట్ తన దుస్తులు విప్పి, మహిళల సాక్స్ ధరించి కాళ్లతో విమానం నడిపాడు. దీంతో సదరు పైలట్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన బ్రిటిష్ ఎయిర్ వేస్‌లో జరిగింది. అతను అలాంటి చర్యకు పాల్పడ్డప్పుడు విమానంలో దాదాపు 400 మంది ప్రయాణీకులు ఉన్నారు.
బ్రిటిష్ ఎయిర్ వేస్‌లో పని చేస్తున్న కొలిన్ గ్లోవర్ మధ్య తరహా, భారీ విమానాలు నడపడంలో నిష్ణాతుడు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 777ను నడిపిన అనుభవం ఉంది. అయితే విమాన ప్రయాణం మధ్యలో అతను విపరీత చర్యలకు పాల్పడినట్లు వెలుగు చూసింది.

వివిధ సందర్భాలలో పోర్న్ ఫోటోలు చూస్త, దుస్తులు విప్పి కాళ్లతో విమానం నడుపుతున్న ఫోటోలు బహిర్గతం అయ్యాయి. దీంతో అతని పైన వేటు పడింది.
దీనిపై సదరు పైలట్ కూడా స్పందించాడు. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, తన పైన కుట్ర జరిగి ఉండవచ్చునని చెబుతున్నాడు. దీంతో విమానయాన సంస్థ మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు ప్రారంభించింది. ఒకవేళ ఆ ఫోటోలోని వ్యక్తి అతనేనని తేలితే మాత్రం లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పింది.