వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో పెను సంక్షోభం: విమాన సర్వీసులపై ప్రభావం: వారి భవిష్యత్తేమిటో?

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన విమాన సర్వీసుల్లో ఒకటి బ్రిటీష్ ఎయిర్‌వేస్. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోన్న ఆ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విలవిల్లాడుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనుంది. 12 వేల ఉద్యోగాల్లో కోత పెట్టాలని నిర్ణయించుకున్నట్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థ యాజమాన్యం వెల్లడించింది.

 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..

12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..

12 వేల మంది అంటే.. ఆ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల్లో 30 శాతం వరకు ఉంటారు. వారందరికీ ఉద్వాసన పలకబోతోందా సంస్థ. ఉద్వాసనకు గురి కాబోయే వారిలో ఉన్నత హోదాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్రత వల్ల సుమారు నెలరోజులుగా విమాన సర్వీసులేవీ నడవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలన్నీ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. బ్రిటీష్ ఎయిర్‌వేస్ దీనికి మినహాయింపేమీ కాదు.

 535 మిలియన్ యూరోల నష్టాలతో..

535 మిలియన్ యూరోల నష్టాలతో..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్ గ్రూపు సంస్థలన్నీ 535 మిలియన్ యూరోల నష్టంతో తాము కార్యకలాపాలను కొనసాగించాల్సి వస్తున్నాయని, ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లపాటు కొనసాగించాల్సి వస్తే.. ఆర్థిక ఊబిలో కూరుకునిపోవాల్సి వస్తుందని బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధినేత అలెక్స్ క్రూజ్ తెలిపారు. సంస్థ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని అన్నారు.

కరోనా మిగిల్చిన సంక్షోభం..

కరోనా మిగిల్చిన సంక్షోభం..

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులేవీ తిరగట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులను అమలు చేస్తుండటం వల్ల దాని ప్రభావం ప్రజా రవాణాపై తీవ్రంగా పడింది. బస్సులు, రైళ్లు సహా విమానాలేవీ అందుబాటులో లేకుండా పోయాయి. విమానాల రాకపోకలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధం ఎన్నిరోజులు ఉంటుందనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

నష్టాల ఊబిలో విమానయాన సంస్థలు..

నష్టాల ఊబిలో విమానయాన సంస్థలు..

ప్రజా రవాణా వ్యవస్థలో మిగిలిన వాటితో పోల్చుకుంటే.. విమానయాన సంస్థల్లో వేతనాలను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వల్ల విమానాలన్నీ నేల వాలిపోయాయి. ఫలితంగా- పలు విమానయాన సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. బ్రిటీష్ ఎయిర్‌వేస్ సైతం నష్టాల ఊబిలో చిక్కుకుంది. దీన్ని నివారించడానికి 12 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది.

Recommended Video

Watch Flights Parking at Delhi's Airport, Rare Video Must Watch

English summary
British Airways is set to slash up to 12,000 jobs as part of a restructuring plan as the carrier grapples with the fallout of the novel coronavirus pandemic, its parent company IAG said Tuesday. The firm said it was still deliberating its options but that it was “likely that they will affect most of British Airways’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X