వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

British cancer specialist jailed for sexually assaulting young patients
లండన్: వైద్య సహాయం కోసం వచ్చిన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వైద్యుడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి 22ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.

మొత్తం 18మంది బాలికలపై పట్ల మైల్స్ బ్రాడ్‌బరీ అనే ఆ వైద్యుడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. నిందిత వైద్యుడు కేంబ్రిడ్జిలోని అడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో రక్త కేన్సర్ నిపుణుడిగా ఉన్నారు. 2009 నుంచి ఆయనపై 25 ఆరోపణలు వచ్చాయి.

13ఏళ్ల వయసున్న బాలికపై కూడా అతడు లైంగిక దాడి చేసినట్లు, ఆ సమయంలో ఫొటోలు కూడా తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాలతో కూడిన డివిడి ఒకటి తమకు వచ్చినట్లు బ్రిటన్ బాలల హక్కుల కేంద్రం చెప్పడంతో 2013లో బ్రాడ్‌బరీని పోలీసులు అరెస్ట్ చేశారు.

వైద్య సహాయం కోసం వచ్చిన 18మంది యువతుల పట్ల మైల్స్ బ్రాడ్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడని, వాళ్ళు అతడ్ని ఎంతగానో నమ్మి వస్తే వారిపట్ల అసభ్యంగా ప్రవర్థించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది మిచెల్ బ్రౌన్ అన్నారు.

ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లను కూడా అతడు వదల్లేదని, అతడికి 22ఏళ్ల జైలు శిక్ష విధించడం భావ్యమేనని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు తీర్పు అనంతరం ఆమె వ్యాఖ్యానించారు.

English summary
A British cancer doctor was jailed for 22 years on Monday for sexually abusing 18 of his young patients with what prosecutors described as "unimaginable cruelty."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X