వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్‌లో 5 లక్షల మంది మృతి, బ్రిటిష్ స్టడీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. వైరస్ విజృంభించడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వాలు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. అయితే బ్రిటీష్ స్టడీ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్‌లో 5 లక్షల మంది చనిపోతారనే కఠోర సత్యాన్ని తెలిపింది. దీంతో మరింత ఆందోళన నెలకొంది.

22 లక్షల మంది మృత్యువాత..?

22 లక్షల మంది మృత్యువాత..?

లండన్ ఇంపిరీయల్ కాలేజీలో మ్యాథమేటికల్ బయోలాజికల్ ప్రొసెర్ నీల్ ఫెర్గూసన్ బృందం కరోనా మహమ్మరి ఎంతమందిపై ప్రభావం చూపుతుందనే అంశంపై అధ్యయనం చేసింది. చైనా తర్వాత వైరస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోన్న ఇటలీ నుంచి ఫెర్గూసన్ బృందం సమాచారం సేకరించింది. ఆ డేటా ఆధారంగా అమెరికా, బ్రిటన్‌లో వైరస్ ప్రభావంపై అంచనా వేశారు. 1918 నాటి ప్లూ వ్యాధితో కరోనా వైరస్‌ను పోల్చిచూశారు. వైరస్‌కు నివారణ మందు ఇప్పటివరకు లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెక్కగట్టారు. అది అగ్రరాజ్యం అమెరికాలో 22 లక్షలుగా ఉంటుందని, బ్రిటన్‌లో యూఎస్‌తో పోల్చుకుంటే కాస్త తక్కువగా 5 లక్షల మంది చనిపోతారని తెలిపింది.

 దూరం.. దూరం...

దూరం.. దూరం...

వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో లక్షణాలు కనిపించిన, పాజిటివ్ ఉన్నవారు బయటకు వెళ్లకుంటే మంచిదని సూచించారు. తగిన చర్యలు తీసుకొకుంటే మృతుల సంఖ్య 2 లక్షల 50 వేలకు చేరుతోందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అందుకోసమే క్లబ్‌లు, పబ్బులు, థియేటర్లు, జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో నిషేధం విధించాలని సూచించింది. వైరస్ వ్యాప్తితో ప్రాణ నష్టమే గాక.. ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని ఫెర్గూసన్ బృందంలోని సభ్యులు ప్రొఫెసర్ అజ్రా ఘని పేర్కొన్నారు.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
వణుకుతోన్న బ్రిటన్..

వణుకుతోన్న బ్రిటన్..

అధ్యయనం మాత్రం బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. మరింత జాగ్రత్తలు తీసుకొనేందుకు సాయపడనుంది. రాబోయే కష్టాన్ని స్టడీ తెలియజేసిందని మరో నిపుణులు టిమ్ కోల్బోర్న్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నది. వందలాది మంది చనిపోవడం.. వేలాది మందికి వ్యాధి సోకడంతో జనసమ్మర్ధం ఉన్న చోట గుమిగూడొద్దని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. వృద్ధులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున వారిని వేరుగా ఉంచాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేశారు. కరోనా కలవరంతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కూడా గజగజ వణికిపోతోంది.

English summary
The projection study, by a team led by Neil Ferguson, outbreak could have caused more than half a million deaths in Britain and 2.2 million in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X