• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్..రోజంతా సెక్స్: ఆమెపై 22గం.ల్లో 110మంది రేప్!

By Srinivas
|

ఏథెన్స్: 14 ఏళ్ల అమ్మాయి గ్రీకు దేశానికి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఆమెను 22 గంటల్లోనే 110 మంది రేప్ చేశారట. ఆ అమ్మాయి 2009లో గ్రీకు దేశానికి తల్లితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అది ఆమె పాలిట విషాదయాత్రగా మారింది.

మరీ షాకింగ్ ఏమంటే... ఆమెను ప్రియుడే సెక్స్ బానిసగా చేశాడు. దీంతో ఆరేళ్ల పాటు వేశ్యగా నరకయాతన అనుభవించింది. ఆ తర్వాత ఎట్టకేలకు ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్ అండ్ సోల్డ్'గా పుస్తక రూపంలో తెచ్చింది.

ఓ వ్యభిచారిణిగా తాను అనుభవించిన హృదయవిదారకరమైన దుస్థితిని పుస్తకంలో వివరించింది. రోజుకు 50 మందితో శృంగారం జరిపేలా ఆమె పైన ఒత్తిడి తెచ్చారు. ఒక్కోసారి 22 గంటల్లోనే 110 మంది ఆమెతో బలవంతంగా సెక్స్ జరిపేవారట.

British woman, sold as sex slave in Greece, was raped by 110 men in 22 hours

కొన్నిసార్లు వీధుల్లో, మరికొన్నిసార్లు వేశ్యా గృహాల్లో తాను పడుపు వృత్తిని భరించవలసి వచ్చిందని పేర్కొంది. 14 ఏళ్ల వయస్సులో గ్రీకు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆమె తన పుస్తకంలో ఆ వివరాలను వెల్లడించింది. అప్పుడు తన తల్లితో కలిసి ఆమె ఓ గ్రీకు బార్‌లో ప్రియుడు జాక్‌ను మొదటిసారి కలిసింది.

అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న ఆమె అతడిని తొందరగా ప్రేమించింది. తల్లికి జాక్ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. విహారయాత్ర ముగిశాక తాను జాక్‌తో కలిసి గ్రీకులోనే ఉండిపోతానని ఆమె తల్లితో చెప్పింది.

ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాక ప్రియుడు జాక్ తన అసలు రూపాన్ని చూపించాడు. టాప్ లెస్‌గా బార్‌లో నర్తించాలని ఒత్తిడి తెచ్చాడు. దానితో వచ్చే డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని నమ్మబలికాడు. అందుకు ఆమె ఒప్పుకోలదు. దీంతో ఓ వ్యక్తికి అమ్మేశాడు.

క్రమంగా ఆమె పడుపువృత్తిలోకి నెట్టివేయబడింది. ఆమెతో అయిదు నిమిషాలు గడిపితే ఓ విటుడు 20 గ్రీకు కరెన్సీలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో 22 గంటల పాటు ఏకధాటిగా ఈ వృత్తి కొనసాగేదని వాపోయింది. దాదాపు 110 మందితో ఆమె శృంగారంలో పాల్గొన్న దారుణ సంఘటనలు ఉన్నాయి.

ఆ తర్వాత తప్పించుకొని బ్రిటన్ వచ్చి తల్లిని కలుసుకుంది. ఇప్పుడు ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని ఆమె ఇప్పుడు భావిస్తోంది.

English summary
Her holiday to Greece turned into a dreaded nightmare. At the age of 14, Megan Stephens (not her real name) had gone to a seaside town in Greece with her mother on a holiday; hardly she knew how horrifying the trip would turn out to be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X