వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల దాడిలో బ్రిట్నీస్పియర్‌ మాజీ ప్రియుడు, పైలట్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ మాజీ ప్రియుడు జాన్ సుందాల్ (44) దుర్మరణం చెందాడు. కాబుల్ నుండి హెలికాప్టర్‌లో వెళ్తుండగా తాలిబన్లు దానిని కూల్చివేశారు. జాన్ సుందాల్ పైలట్‌గా పని చేస్తున్నాడు. పైలట్ అయిన అతను కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారులను తీసుకు వెళ్లేందుకు ప్రయివేటుగా ఒప్పంద ప్రతిపాదికన పని చేస్తున్నాడు.

జాన్ సుందాల్ బ్రిట్నీ స్పియర్‌తో గతంలో డేటింగ్ చేశాడు. ఆమెకు పలు అంశాల్లో సహాయం చేశాడు. బ్రిట్నీ, జాన్ సుందాల్‌లకు 2007లో పరిచయమైంది. అనంతరం కొద్దిరోజులు డేటింగ్ చేశారు. అల్కాహాల్ తీసుకుంటే అది తనను చంపేస్తుందని అతను తనను హెచ్చరించాడని బ్రిట్నీ స్పియర్ ఓ సందర్భంలో తెలిపారు.

మగవాళ్లూ.. మగువల మాట వినండి: పోప్‌

Britney Spears' ex shot by Taliban

మగువల విషయంలో మగవాళ్లు తమ ఆలోచనల్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని, ప్రతి పురుషుడూ ముందు మహిళలు చెప్పే వాటిని ఓపికగా వినాలని, అనేక అంశాలలో మహిళల ఆలోచనా పరిధి, విశ్లేషణా శక్తి పురుషుల కంటే ఎక్కువని అంగీకరించాల్సిందేనని పోప్ అన్నాడు.

మత విషయాలలో నాటి చర్చి ప్రతినిధులు మహిళలను దూరంపెట్టటం అర్థంపర్థం లేని చర్య అని, తమ హయాంలో వాటికన్‌ వ్యవహారాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచుతామని పోప్‌ ప్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. మనీలాలో జరిగిన ఓ స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సభకు సుమారు 60 లక్షల మంది హాజరయ్యారని వాటికన్‌ వర్గాలు తెలిపాయి. 1995లో అరకోటి మంది నాటి పోప్‌ రెండో జాన్‌ పాల్‌ సభకు హాజరయ్యారు. ఇప్పటి వరకూ అదే అతిపెద్ద జనసభ. కనుచూపు మేరా జనంతో నిండిపోయిన సభను చూసిన పోప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

English summary
The pilot who dated Britney Spears and helped her fight drugs has been shot dead by the Taliban in Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X