వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఎస్సెమ్మెస్ తో.. స్మోకింగ్ మానడం ఖాయమట

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ఏదైనా ఓ వ్యవసనానికి అలవాటు పడితే, దాని నుంచి బయటపడ్డం అంత తేలికైన విషయం కాదు. చెడు వ్యసనానికి అలవాటైన మనిషి శారీరక, మానసిక స్థితి మీద తీవ్రమైన దుష్ఫలితాలుంటాయి. అయితే, వ్యసనాలకు బానిసైన వారిలో వాటినుంచి బయటపడాలనే ప్రయత్నం చేసేవారు కొందరైతే.. అదే అఘాతంలో కూరుకుపోయి చివరికి వ్యసనాలతోనే ప్రాణాలు కోల్పోయేవారు మరికొందరు.

ధూమపానం కూడా ఆ కోవలోదే. సిగరెట్ ప్యాకెట్లపై వాటి పర్యవసానాలను సూచించే 'ఊపిరి తిత్తులు దెబ్బ తినడం', లాంటి చిత్రాలను ముద్రించినా..! సినిమా హాల్స్ లో సినిమా కంటే ముందు 'ఈ నగరానికేమైంది..' అంటూ ధూమపాన నియంత్రణ ప్రకటనలు చేసినా, పొగతాగే వారికి మాత్రం ఇవేమి పట్టవు. అయితే.. ఇవేవి చేయని పనిని ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా చేసి చూపించవచ్చునని అంటున్నారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనకారులు.

brown university

సిగరెట్ స్మోకింగ్ అలవాటున్న కొంతమంది వ్యక్తుల జాబితా తీసుకుని, వారిని స్మోకింగ్ నుంచి దూరం చేసేందుకు కొన్ని రకాల ఎస్సెమ్మెస్ లను నిత్యం వారికి చేరవేసేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. 'స్మోకింగ్ మానేయడం నీవల్ల సాధ్యమవుతుంది', 'మానసికంగా ధృడంగా ఉండగలవు' వంటి ఎస్సెమ్మెస్ లు పొగతాగే వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తాయని చెప్తున్నారు అధ్యయనకారులు.

English summary
the american brown university research scholors found a new idea to quit smoke
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X