• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'కిమ్‌ కోసం సెక్స్ బానిసలు, ఎదురు తిరిగితే ఉరే'

By Narsimha
|
  కిమ్‌ కోసం సెక్స్ బానిసలు ...ఒకవేళ గర్భం వస్తే వారిని ఏం చేసేవారో తెలుసా ? | Oneindia Telugu

  ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అనేక అకృత్యాలకు పాల్పడేవారని తేలింది. కిమ్ నివాసాల్లో టీనేజ్ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకొంటారని బాధిత మహిళ మీడియాకు వివరించింది. కిమ్‌కు ఎదురుతిరిగితే చావు తప్పదని ఆమె చెప్పారు.

  'ఆ దేశాల వల్లే 3వ, పప్రంచ యుద్దం', 'ట్రంప్ వల్లే రెచ్చిపోతున్న కిమ్'

  ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తన వ్యవహరశైలితో ప్రపంచదేశాలను వణికిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కిమ్ చుక్కలు చూపిస్తున్నారు.

  ట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలు

  అమెరికాతో అమీతుమీకీ కిమ్ సిద్దమయ్యారు. అమెరికా కూడ కిమ్ అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. రెండు దేశాల మధ్య రెండు రోజుల వ్యవధిలో మాటల యుద్దం మరింత తీవ్రమైంది.

  కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'

  ఈ పరిణామాలన్నీ ప్రపంచదేశాలు పరిశీలిస్తున్నాయి. ఉత్తరకొరియాను కట్టడి చేయాలని ప్రపంచదేశాలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దక్షిణ కొరియాకు సహయం ఆపడం మానేయాలని ఉత్తరకొరియా డిమాండ్ చేస్తోంది. అమెరికాకు తక్కువ కాకుండా ఆయుధ సంపత్తిలో ఉత్తరకొరియా నిలబడే స్థితికి చేరుకొందని ఇటీవలే కిమ్ ప్రకటించారు.

  కిమ్ నివాసాల్లో సెక్స్ బానిసలు

  కిమ్ నివాసాల్లో సెక్స్ బానిసలు

  కిమ్ నివాసాల్లో టీనేజ్ మహిళలను సెక్స్ బానిసలుగా ఉపయోగించుకొంటారని 26 ఏళ్ళ హీ యోన్ లిమ్ అనే మహిళ చెప్పారు. తాను టీనేజీలో ఉన్న సమయంలో కిమ్ నివాసాల్లో సెక్స్ బానిసగా వాడుకొన్నారని ఆమె ఆరోపించారు. లైంగిక కార్యకలాపాల కోసం కిమ్ పరివారానికి సంబంధించిన ఇళ్ళల్లో తిప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  టీనేజీ అమ్మాయిలను బంధించి లైంగిక వేధింపులు

  టీనేజీ అమ్మాయిలను బంధించి లైంగిక వేధింపులు

  అనేక మంది అమ్మాయిలను ఇళ్ళలో బంంధించి లైంగిక వాంఛలు తీర్చుకొనేవారని బాధితురాలు తెలిపారు. తాము పడే చిత్రహింసలను చూసి వారంతా సంతోషపడేవారని ఆమె చెప్పారు. కిమ్ ఆయన చుట్టూ ఉన్న మనుషులంతా తమను తాము రాజులుగా భావించేవారని ఆమె గుర్తుచేసుకొన్నారు.

  గర్భం వస్తే ఇక అంతే

  గర్భం వస్తే ఇక అంతే

  సెక్స్ బానిసలుగా తీసుకెళ్ళిన అమ్మాయిలు తప్పులు చేస్తే ఇక వారు కన్పించకుండా పోయేవారని బాధితురాలు చెప్పారు. ఒకవేళ గర్భం వచ్చినా వారిని కన్పించకుండా చేసేవారని లిమ్ ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వాంఛలు తీర్చుకొనేవారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని చెప్పారు.

  ఫోర్నోగ్రఫీకి పాల్పడ్డారని క్రూరంగా చంపారు

  ఫోర్నోగ్రఫీకి పాల్పడ్డారని క్రూరంగా చంపారు

  పదకొండు మంది సంగీతకారులను అత్యంత దారుణంగా హత్య చేశారని లిమ్ గుర్తుచేసుకొన్నారు. ఫోర్నోగ్రఫీకి పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రజలను చుట్టూ నిలబెట్టి పొలాల్లోకి తీసుకెళ్ళి ఎయిర్‌గన్‌లతో కాల్చి వేశారని ఆమె చెప్పారు. మృతదేహలను ముక్కలు ముక్కలు చేశారని ఆమె చెప్పారు.

  యుద్ద ట్యాంకులతో తొక్కించారు

  యుద్ద ట్యాంకులతో తొక్కించారు

  కొన్ని మృతదేహలను యుద్దట్యాంకులతో తొక్కించారని లిమ్ చెప్పారు. కిమ్ హత్యాకాండకు అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కిమ్‌పై విశ్వాసం లేనివారిని ఉరి తీయిస్తారని ఆమె చెప్పారు.తొలుత చైనాకు, అక్కడి నుండి దక్షిణ కొరియాకు వచ్చి స్థిరపడినట్టు బాధితురాలు తెలిపారు. తన తండ్రి కొరియన్ పీపుల్స్ ఆర్మీలో విధులు నిర్వహించేవాడని ఆమె చెప్పారు. 2015లోనే తన తండ్రి మరణించాడని బాధితురాలు చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A North Korean defector has risked her life and revealed to the world horrifying details of the decadent and despotic lives which the isolated regime's leader Kim Jong Un and his inner circle lead, Hee Yeon Lim, a 26-year-old whose family was once part of Pyongyang's privileged elite, fled North Korea with her mother and younger brother after her father, a colonel in the Korean People's Army, died in 2015. They escaped to China, and then to the South Korean capital of Seoul.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more