వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

42వేల అడుగుల ఎత్తులో విమానం: ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!(పిక్చర్స్)

గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానంలోకి అనుకోని అతిథి అడుగుపెట్టింది. విమానం 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ పండంటి పాపకు జన్మనివ్వడంతో ఈ అరుదైన చోటు చేసుకుంది. ఈ ఘటన టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమ

|
Google Oneindia TeluguNews

ప్యారిస్/ఇస్తాంబుల్: గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానంలోకి అనుకోని అతిథి అడుగుపెట్టింది. విమానం 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ పండంటి పాపకు జన్మనివ్వడంతో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది.

విమానంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది..

విమానంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది..

ఆదివారం గునియాలోని కోనాక్రే నుంచి ఇస్తాంబుల్‌ వెళ్తున్న విమానంలో నాఫీ దియాబే అనే ఫ్రెంచ్ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చారు. 28 వారాల గర్భంతో ఉన్న నాఫీకి విమానంలో ఉండగా నొప్పులు వచ్చాయి. గమనించిన విమాన సిబ్బంది వెంటనే ఆమెకు సహాయం అందించారు.

సురక్షితంగా..

సురక్షితంగా..

అంతేగాక, తోటి ప్రయాణికులు కూడా నాఫీకి డెలివరీ చేయడంలో సహాయపడ్డారు. దీంతో చిన్నారి విమానంలోనే సురక్షితంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ఘటనతో విమాన సిబ్బంది సహా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిన్నారితో ఫొటోలు కూడా దిగారు.

పేరూ పెట్టేశారు..

పేరూ పెట్టేశారు..

కాగా, విమానంలో పుట్టిన ఈ చిన్నారికి కదిజు అనే పేరు పెట్టింది ఆమె కన్నతల్లి. ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో విమానం దించి తల్లీబిడ్డను ఆస్పత్రికి పంపించారు. తల్లీబిడ్డ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.

అభినందనల వెల్లువ

అభినందనల వెల్లువ

ఇది ఇలా ఉండగా, ఆ చిన్నారితో ఫొటోలు దిగిన విమాన సిబ్బంది ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి పుట్టిన ప్రదేశం గురించి సర్టిఫికేట్‌లో ఏం రాస్తారో.. అంటూ పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.

English summary
A French woman gave birth to a healthy baby girl aboard a Turkish Airlines plane last week.Guinean Diaby Nafi, who had been pregnant for 28 weeks, went into labour pain shortly after the plane took off from Conakry, Guinea, en route to Turkey with a stop in Ougadougou, Burkina Faso, on April 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X