వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి పైశాచికం: కూతురిపై 4 ఏళ్లు రేప్, 1503 ఏళ్ల జైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఫ్రెస్నో: ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని చెప్పిన పాపానికి దాన్ని ఆసరా చేసుకుని కన్న కూతురిపై ఓ తండ్రి ఘాతుకానికి దిగాడు. వరుసగా నాలుగేళ్ల పాటు వారానికి రెండు మూడు సార్లు అతను కూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇందుకు గాను అతనికి కోర్టు చరిత్రలో నిలిచిపోయే గరిష్ఠ జైలు శిక్ష విధించింది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో ప్రాంతంలో 41 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసును విచారించిన ఫ్రెస్నో అత్యున్నత న్యాయస్థానం అతడిని దోషిగా నిర్దారించి 1,503 ఏండ్ల జైలు శిక్ష విధించింది. బాలిక చిన్నతనంలో కుటుంబ స్నేహితుడైన ఓ వ్యక్తి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పినా పట్టించుకోలేదు.

California father is sentenced to 1,503 years in prison

పైగా దాన్ని అవకాశంగా తీసుకొని బాలికపై నాలుగేళ్ల పాటు లైంగికదాడి చేశాడు. తండ్రి నుంచి పారిపోయే ధైర్యం బాలికకు వచ్చే సరికి 2009-13 మధ్య వారానికి రెండుసార్లు లైంగికదాడి చేస్తూ వచ్చాడు. నిందితుడు చేసిన తప్పునకు పశ్చాతాప పడకపోగా తానేమీ తప్పు చేయలేదని వాదనకు దిగడంతో కోర్టు ఆగ్రహించి అతడికి గరిష్ఠ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఈ వ్యక్తి సమాజానికి తవ్రమైన ప్రమాదకారి అని కోర్టు వ్యాఖ్యానించింది. తన తండ్రి తనపై దాడికి దిగినప్పుడు తాను చిన్నపిల్లనని, తనకు శక్తీ గొంతూ లేవని, తాను ఎదుర్కోలేకపోయానని బాధితురాలు చెప్పింది. ఇప్పుడు ఆమెకు 23 ఏళ్లు. తాను తప్పు చేశానని నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తంచేసి తప్పు చేశానని అంగీకరించి ఉంటే కోర్టు అతనికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించి ఉండేది. అయితే, అతను దానికి అంగీకరించలేదు

English summary
A Fresno man was sentenced to 1,503 years in prison for raping his teenage daughter over a four-year period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X