వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరెంజ్ కలర్‌లో ఆకాశం: బిత్తరపోతోన్న జనం: ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ:

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వేకువ జామున ఆకాశం ఎలా ఉంటుంది? ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. అప్పుడప్పుడే ప్రసరిస్తోన్న భానుడి కిరణాలు వెచ్చగా స్పృశిస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది. జనాలను బిత్తరపోయేలా చేసింది. ఆకాశం నారింజ రంగును పులముకున్నట్లు కనిపించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం దీనిపై రెస్పాండ్ అయ్యారంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనూహ్యంగా కనిపించిన ఈ ఘటనతో కాలిఫోర్నియావాసులు ఉలిక్కిపడ్డారు.

కమలా హ్యారిస్ తాత ఏం చేసేవారో తెలుసా: 60 ఏళ్ల కిందటే ఒంటరిగా: చెన్నై టు కాలిఫోర్నియాకమలా హ్యారిస్ తాత ఏం చేసేవారో తెలుసా: 60 ఏళ్ల కిందటే ఒంటరిగా: చెన్నై టు కాలిఫోర్నియా

నారింజ రంగులో మెరిసిన ఆకాశం..

కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో తీర ప్రాంతం (బే ఏరియా) సహా ఓక్లాండ్ ప్రాంతాల్లో ఆరెంజ్ రంగులో కనిపించడంతో స్థానికులు తమ మొబైల్ ఫోన్లకు పని పెట్టారు. ఫొటోలు, వీడియోలను తీశారు. సూర్యోదయం మొదలుకుని సుమారు మూడు గంటల పాటు ఆకాశం ఆరెంజ్ రంగులో మెరిసిపోతూ కనిపించింది. కొన్నిచోట్ల మంచు సైతం కురిసినట్లు సమాచారం. దట్టమైన పొగ అలముకోవడం వల్లే సూర్యకిరణాలు అలా పరావర్తనం చెందాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కూడా బే ఏరియాలో చీకట్లు వీడలేదు. వీధి దీపాలు వెలుగుతూనే కనిపించాయి.

స్పందించిన బరాక్ ఒబామా

ఇలాంటి వాతావరణం ఇంతకుముందెప్పుడూ చూడలేదంటూ కాలిఫోర్నియావాసులు ట్వీట్లు చేస్తున్నారు. బరాక్ ఒబామా సైతం తన ట్విట్టర్ అకౌంట్‌కు పని చెప్పారు. ఉన్నపళంగా ఆకాశం నారింజ రంగులో మారిపోవడానికి కారణాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలో వేలాది హెక్టార్లలో కార్చిచ్చు చెలరేగడమే దీనికి కారణమని అన్నారు. లక్షల హెక్టార్లలో అడవులు మంటల్లో కాలిపోతున్నాయని, దాని తీవ్రతకు ప్రస్తుత వాతావరణం అద్దం పడుతోందని చెప్పారు. వాతావరణంపై కార్చిచ్చు ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమౌతోందని అన్నారు.

Recommended Video

Onions Virus:ఉల్లిపాయలు ద్వారా Salmonella Virus పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఉల్లిపాయలపై నిషేధం!

రోజుల తరబడి మంటలు..

కాలిఫోర్నియా అడవుల్లో మరోసారి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. లక్షలాది ఎకరాలు బుగ్గిపాలవుతున్నాయి. ఒరెగాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మంటల్లో చిక్కుకుని ముగ్గురు మరణించారు. సుమారు నెల రోజులుగా కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగుతోన్న మంటలు మరింత ఉగ్రరూపాన్ని దాల్చాయని, దాని ప్రభావంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈదురు గాలులు వీస్తుండటం వల్ల మంటలు ఏ మాత్రం అదుపులోకి రావట్లేదని కాలిఫోర్నియా మేయర్ వెల్లడించారు.

English summary
Residents of the Bay Area, San Francisco and Oakland in California, US woke up to disorienting orange skies today. They took to Twitter to share the images of the apocalyptic orange-hued sky caused due to the raging wildfires in California.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X