వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు చుక్కెదురు: ఓటింగ్ సరిగా జరగలేదనడం తప్పు, పిటిషన్ తిరస్కరణ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్ర ఫలితాలపై ట్రంప్ ఫైట్ చేస్తున్నారు. ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం తిరస్కరించింది. ట్రంప్ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఫలితాలను నిలిపివేయాలనే పిటిషన్‌ను డిస్ క్వాలిఫై చేసింది.

నవంబర్ 3వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించి అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కోర్టులపై కామెంట్ చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దిగువ కోర్టు మాత్రం ట్రంప్ వివక్షను ఎదుర్కొన్నారని కోర్టు తెలిపింది.

Calling Vote Unfair Doesnt Make It So, Court Tells Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత దాదాపు 20కి పైగా కోర్టుల్లో ట్రంప్ పిటిషన్ దాఖలు చేశారు. బిడెన్ విజయాన్ని అంగీకరించలేదు. ఈ ఎన్నిక మోసం అని అభివర్ణించారు. ఇప్పుడే కాదు గత వారం కూడా ఇలాంటి అభియోగాలకు సంబంధించి పెన్సిల్వేనియా కోర్టు కూడా పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే గత మంగళవారం పెన్సిల్వేనియాలో బిడెన్ విజయం సాధించారని ధృవీకరించిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం రాజీలేకుండా పోరాటం చేస్తున్నారు. అయితే ఇవాళ మరొసారి చుక్కెదురు కావడం విశేషం.

English summary
federal appeals court on Friday flatly dismissed President Donald Trump's claim that the election was unfair and refused to freeze Joe Biden's win in the key state of Pennsylvania.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X