వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:కోవిడ్ నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులపై పరిశోధనలు ఏం తేల్చాయి..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ సోకితే అది మనిషి యొక్క ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే శ్వాస తీసుకోవడంలో మనిషి ఇబ్బంది పడతారని అది మరింత తీవ్రతరం అయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజం అని చెప్పేందుకు కరోనావైరస్ సోకిన వారి ఊపిరితిత్తులపై మచ్చలు ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కొత్తగా 2392 కరోనా పాజిటివ్ కేసులు..గత 24 గంటల్లో 11 మంది మృతితెలంగాణలో కొత్తగా 2392 కరోనా పాజిటివ్ కేసులు..గత 24 గంటల్లో 11 మంది మృతి

 ఆస్ట్రియా వైద్యులు ఏం చెబుతున్నారు..?

ఆస్ట్రియా వైద్యులు ఏం చెబుతున్నారు..?

కరోనావైరస్ ఒక్కసారి సోకిన తర్వాత ఆ మనిషి యొక్క ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయా అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రియాకు చెందిన వైద్యులు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే ఈ స్టడీని మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ -19 బారిన పడిన తీవ్ర అనారోగ్యంకు గురై ఆపై కోలుకున్న 82 మందిపై పరిశోధనలు చేశారు. వారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆరువారాలకోసారి, ఆ తర్వాత 12 వారాలకోసారి ఆ తర్వాత 24 వారాలకోసారి వారి శ్వాసకోశ వ్యవస్థను పరిశీలించడం జరిగింది. ఈ స్టడీని వైద్యులు ఏప్రిల్ జూన్ నెలల మధ్య నిర్వహించారు.

 6వారాలకు 12 వారాలకు తీసిన సీటీ స్కాన్ రిపోర్టు

6వారాలకు 12 వారాలకు తీసిన సీటీ స్కాన్ రిపోర్టు

కోవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్ల ఊపిరితిత్తులను ఆరువారాల తర్వాత ఒకసారి సీటీ స్కాన్ చేశారు. అనంతరం 12 వారాల తర్వాత మళ్లీ సీటీ స్కాన్ చేసి రెండు రిపోర్టులను పోల్చి చూడగా... పేషెంట్ల ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అనేది క్రమంగా తగ్గిందని చెప్పారు. ఆరువారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో దాదాపు 88 శాతం మంది పేషెంట్లలో ఊపిరితిత్తుల డ్యామేజ్ బాగా జరిగిందని చెప్పిన వైద్యులు.. 12 వారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో 56శాతం మంది పేషెంట్లలో ఊపిరితిత్తులు మెరుగయ్యాయని అంటే పేషెంట్ క్రమంగా కోలుకున్నారని వెల్లడించారు. ఇదే విషయం ఫ్రాన్స్‌లో జరిగిన మరో అధ్యయనం ద్వారా కూడా వెల్లడైంది.

ఊపిరితిత్తుల డ్యామేజ్ తగ్గింది

ఊపిరితిత్తుల డ్యామేజ్ తగ్గింది

ఈ అధ్యయనం ద్వారా కోవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లకు సంబంధించిన ఊపిరితిత్తుల సామర్థ్యం,కండరాల బలం, అలసట తగ్గడం, మరియు ఆందోళన చెందడంలాంటి అంశాలపై గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా గమనిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతున్న వారి సీటీ స్కాన్‌ను పరిశీలించగా..20 నుంచి 30శాతం కేసుల్లో ఊపిరితిత్తులపై కరోనా మచ్చలు కనిపించినట్లు వెల్లడించారు.అయితే ఊపిరితిత్తుల పై ఉన్న ఈ మచ్చలకు మందు శరీరంలోని రోగనిరోధక శక్తి మాత్రమే అని గులేరియా చెప్పారు. కొన్ని కేసుల్లో ఊపిరితిత్తులకు ఎలాంటి హాని కలగలేదని మరికొన్న కేసుల్లో మాత్రం కరోనావైరస్ మచ్చలు కనిపించాయని వెల్లడించారు.

English summary
A recent study has suggested that after recovery from coronavirus, damaged lungs can repair themselves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X