• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైట్‌హౌస్‌ రేసులోనే ట్రంప్‌- ఇంకా దారులు తెరిచే ఉన్నాయా ? వాస్తవమేంటి ?

|

సుదీర్ఘంగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నా ఇప్పటికే ఆధిక్యం అందుకున్న బైడెన్‌ను వెనక్కి నెట్టి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. బైడెన్‌ గెలుపును సవాల్‌ చేస్తూ ఆయన మొదలుపెట్టిన న్యాయపోరాటం ఇందుకు ఓ కారణం కాగా.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలు మరో కారణం. అయితే ట్రంప్‌ అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే ఇది తేలడానికి మాత్రం మరో నెల రోజుల సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

  US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump

  అమెరికా కొత్త అధ్యక్షుడిపై అదే ఉత్కంఠ- పని మెదలుపెట్టేసిన బైడెన్‌-ఐరోపా నేతలతో చర్చలు...అమెరికా కొత్త అధ్యక్షుడిపై అదే ఉత్కంఠ- పని మెదలుపెట్టేసిన బైడెన్‌-ఐరోపా నేతలతో చర్చలు...

   బైడెన్ గెలుపుని నిర్ధారించని మీడియా..

  బైడెన్ గెలుపుని నిర్ధారించని మీడియా..

  అమెరికా అధ్యక్ష పదవికి హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ తగినన్ని ఓట్లు, సీట్లు సాధించినప్పటికీ ఆయన గెలుపును నిర్ధారించేందుకు మాత్రం మీడియా కచ్చితంగా ముందుకు రాలేని పరిస్ధితి. అమెరికాలో ప్రధాన మీడియా సంస్ధ న్యూయార్క్ టైమ్స్‌తో పాటు ఇతర మీడియా సంస్ధలు కూడా బైడెన్‌ విజయాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే బైడెన్‌ గెలుపుకు ఉన్న అవకాశాలపై మాత్రం విశ్లేషణలు సాగిస్తున్నాయి. వీటిలో బైడెన్‌కు అవకాశం దక్కుతుందనే వాదనే బలంగా ఉంది. అయినా ట్రంప్‌కు ఎక్కడో ఓ చిన్న ఆశ. బైడెన్‌ను అధ్యక్ష పదవి చేపట్టకుండా అడ్డుకోవడం, అది కుదరకపోతే ఆయన విజయాన్ని ఆలస్యం చేయడం మాత్రమే ట్రంప్‌ ముందున్న అవకాశాలుగా తెలుస్తోంది.

   పట్టు వీడని డొనాల్డ్‌ ట్రంప్‌..

  పట్టు వీడని డొనాల్డ్‌ ట్రంప్‌..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకు ఆమడ దూరంలో నిలిచినా పోలింగ్‌ అక్రమాల పేరుతో స్వింగ్‌ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ట్రంప్‌ అన్ని దారులు వెతుకుతున్నారు. ముఖ్యంగా స్వింగ్‌ రాష్ట్రాల్లో కీలకమైన మూడింటిలో రిపబ్లికన్ల పట్టు ఉండటంతో ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఆయా చట్ట సభల సాయంతో తాను వైట్‌ హౌస్‌ రేసులో బయటపడాలని ట్రంప్ భావిస్తున్నారు. అన్నింటి కంటే ముందుగా మూడు స్వింగ్‌ రాష్ట్రాలు పెన్సిల్వేనియా, అరిజోనా, మిచిగాన్‌లో గెలిచిన అభ్యర్ధులను ఆయా రాష్ట్రాల చట్ట సభలు ధృవీకరించకుండా ట్రంప్‌ అడ్డుపడుతున్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. చివరికి ఏమీ తేలకపోతే ఆయా రాష్ట్రాల చట్ట సభలు రిపబ్లికన్‌ ప్రతినిధులను ఎంపిక చేసి తనకు ఓటు వేసేందుకు పంపుతాయని, తద్వారా తన గెలుపు సాధ్యమవుతుందని ట్రంప్‌ అంచనా వేస్తున్నారు.

   ట్రంప్‌ గెలుపు అవకాశాలు ఉన్నాయా ?

  ట్రంప్‌ గెలుపు అవకాశాలు ఉన్నాయా ?

  గతంలో జార్జిబుష్‌తో పాటు పలువురు అధ్యక్షుల హయాంలో ఎన్నికల అధికారులుగా ఉన్న పలువురు న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం స్వింగ్‌ రాష్ట్రాల్లో పాపులర్‌ ఓట్‌ను మార్చడం కుదరని పని. అలాగే రీపోలింగ్, రీకౌంటింగ్‌ నిర్వహించినా ఉపయోగం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే ట్రంప్‌ చెబుతున్న పోలింగ్ అక్రమాలకు ఆధారాల్లేవు. సరైన ఆధారాలు లేకుండా పోలింగ్‌ అక్రమాల ఆరోపణలను ట్రంప్‌ సుదీర్ఘకాలం చేయడం కూడా కష్టమే. మరోవైపు రిపబ్లికన్లకు పట్టున్న స్వింగ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ అక్రమాల పేరుతో చట్టసభలు నేరుగా రిపబ్లికన్‌ ప్రతినిధులను ట్రంప్‌కు మద్దతుగా ఎలక్టోరల్‌ కాలేజీకి పంపినా అప్పటికే ప్రజల్లో నిర్ణయమైన ఫలితాన్ని తారుమారు చేసేందుకు జరిగే ఈ ప్రయత్నాలపై ప్రజాగ్రహం తప్పదని తెలుస్తోంది. కాబట్టి అలాంటి పరిస్ధితుల్లో ట్రంప్‌ కేవలం విజేతను ప్రకటించే ప్రక్రియను మాత్రమే ఆలస్యం చేయగలరని విశ్లేషకులు చెబుతున్నారు.

  English summary
  With no chance to change the popular vote outcome in battleground states, lawyers said Trump’s legal strategy, such as there is one, appeared to be an attempt to delay state elections officials’ certification of Biden as the winner,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X