వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: అధ్యక్ష ఎన్నికలను ట్రంప్ వాయిదా వేసే అవకాశం ఉందా..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అటు డెమొక్రటికల్ జోబిడెన్‌ల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. ఇక కరోనావైరస్‌ ట్రంప్‌కు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందనే చెప్పాలి. ఇక ట్రంప్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా రావడంతో ఆయన ఆరోగ్యంపై అనునిత్యం వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యం కాస్త అటుఇటుగా అయినా అది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పలురకాల వాదనలు తెరపైకొస్తున్నాయి.

 ఎన్నికల పై కరోనా ప్రభావం

ఎన్నికల పై కరోనా ప్రభావం

ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ఇరు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు తమ చుట్టూ తక్కువ మంది అభిమానులు, లేదా సన్నిహితులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇక కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలు ఓటు వేసేందుకు స్వయంగా వస్తారా అనేదానిపై కూడా స్పష్టత లేదు. పోస్టల్ ఓట్ల ద్వారా రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫలితాలు కూడా ఎన్నికలు జరిగే రోజున వెలువడక పోవచ్చని, ఫలితాలు మరింత ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 విరాళాల సేకరణ, ర్యాలీలకు ట్రంప్ దూరం

విరాళాల సేకరణ, ర్యాలీలకు ట్రంప్ దూరం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనావైరస్ పాజిటివ్‌ రావడంతో చాలామటుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు, ర్యాలీలకు హాజరుకావడం లేదు. ఇది కచ్చితంగా ట్రంప్ ఎన్నికపై ప్రభావం చూపుతుంది. కరోనావైరస్ లాంటి వ్యాధి ఇంతకుముందు ఎప్పుడూ లేదని అదే సమయంలో ఇంతకు ముందున్న అధ్యక్షులు ఎవరూ ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు లేవని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కొద్దిరోజుల ముందు ట్రంప్ బిడెన్‌ల మధ్య డిబేట్ జరగాల్సి ఉన్నప్పటికీ ట్రంప్‌ దానికి విముఖత చూపారు. అయితే 18 నిమిషాల పాటు ఆయన వైట్ హౌజ్ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ తన ఆరోగ్యం బాగుందని చెప్పారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది..?

రాజ్యాంగం ఏం చెబుతోంది..?

ఇక అమెరికా ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరగనున్నాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఈ ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందా..? అంటే ట్రంప్ మాత్రం ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు చాలా రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల రిగ్గింగ్ జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేయకూడదని అమెరికా రాజ్యాంగంలో లేదు కాబట్టి పరిస్థితులను బట్టి వాయిదా వేసే అవకాశం ఉంది. అయితే కొత్త అధ్యక్షుడు జనవరి నెలలోగా ప్రమాణస్వీకారం చేయాలని రాజ్యాంగంలో ఉంది.

English summary
The 2020 US election is less than a month away, but the coronavirus pandemic has thrown many aspects of the race into uncertainty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X