వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓసారి కరోనా వచ్చాక మళ్లీ వస్తుందా ? వస్తే ఎలా ఉంటుంది ? తాజా పరిశోధన

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక వీటిపై అంతులేని పరిశోధనలు కూడా సాగుతున్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ ను కచ్చితంగా నివారిస్తుందని చెప్పగలిగే ఒక్క వ్యాక్సిన్ కూడా ఏ దేశంలోనూ అభివృద్ధి చేయలేదు. మన దేశంలోనూ కరోనా వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉంది. అయితే ఆ లోపు జనాన్ని మరో భయం పట్టి పీడిస్తోంది. ఓసారి కరోనా వైరస్ సోకిన వారికి మరోసారి అది సోకే అవకాశాలు ఉంటాయా ? తాజాగా బయటపడుతున్న ఇలాంటి కేసులను చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. అయితే ఇలా రెండోసారి సోకే అవకాశాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, అలా సోకిన వారి పరిస్ధితి ఎలా ఉంటుందన్న దానిపై అమెరికాకు చెందిన డజను మంది వైద్య నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

కరోనా ఉప్పెన: ఒక్కరోజే 45 వేలకు పైగా: 1129 మరణాలు: 12 లక్షల మార్క్‌ క్రాస్: బీభత్సం కరోనా ఉప్పెన: ఒక్కరోజే 45 వేలకు పైగా: 1129 మరణాలు: 12 లక్షల మార్క్‌ క్రాస్: బీభత్సం

 కరోనా మళ్లీ వస్తుందా ?

కరోనా మళ్లీ వస్తుందా ?

ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకుని నయం చేసుకుంటాడు. అయితే మరోసారి అదే వ్యక్తికి కరోనా వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వైరస్ చికిత్సా విధానం కూడా ఇంకా అభివృద్ధి చెందకపోవడం, ఎప్పుడో మలేరియాకు వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మాత్రలపైనే ఇంకా ఆధాపడుతున్న పరిస్ధితుల్లో ఓసారి కరోనా తగ్గాక మళ్లీ సోకదన్న గ్యారంటీ లేదని ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల కొద్దీ రోగులకు కరోనా రెండోసారి కూడా వస్తున్న సందర్భాలు తాజాగా చూస్తూనే ఉన్నాం. అయితే అది ఎప్పుడు, ఎవరికి, ఎలా అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

 రెండోసారి కరోనా ఎలా రావొచ్చు ?

రెండోసారి కరోనా ఎలా రావొచ్చు ?

ఓసారి కరోనా సోకిన వ్యక్తికి ,తగ్గిన తర్వాత మరోసారి కరోనా వస్తే ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై అమెరికాలోని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన డజను మంది డాక్టర్ల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కరోనా ఓసారి సంక్రమించిన తర్వాత నయమై మరోసారి సోకే అవకాశాలు అందరికీ ఉండవు. కేవలం కొన్ని బలహీనమైన పరిస్ధితుల్లో మాత్రమే కరోనా ప్రభావం రోగిలో పైకి నయమైనట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ ప్రభావం చూపడం మొదలుపెడుతుందని డాక్టర్లు తేల్చారు.

 వారాలు, నెలల గ్యాప్ తర్వాతే...

వారాలు, నెలల గ్యాప్ తర్వాతే...

కరోనా వైరస్ ఓసారి వచ్చి నయమయ్యాక తిరిగి అదే రోగికి వైరస్ వచ్చే సందర్భాలు తిరిగి కొన్ని వారాలు, నెలల తర్వాత మాత్రమే ఉంటాయని హార్వర్డ్ వైద్య బృందం తేల్చింది. అంత కంటే తక్కువ సమయంలో మాత్రం వైరస్ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వారు నిర్ధారించారు. ఓసారి వైరస్ సోకిన తర్వాత రోగి శరీరంలో రోగనిరోధకాలు అభివృద్ధి చెందుతాయని, వాటి ప్రభావం రోగి శరీర తత్వాన్ని బట్టి కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటుందని, అంత వరకూ మరోసారి వైరస్ సోకదని తేల్చారు. అంతే కాదు ఈ సమయంలో మరే ఇతర చిన్నా చితకా వైరస్ లు కూడా సోకకుండా కూడా ఇవి అడ్డుకట్ట వేస్తాయని నిర్ధారించారు.

Recommended Video

KCR Govt Planned For 7 Lakh Antigen Tests In The State || Oneindia Telugu
 అలా ఎప్పటివరకూ వస్తూనే ఉండొచ్చు ?

అలా ఎప్పటివరకూ వస్తూనే ఉండొచ్చు ?

మరోవైపు ఇలా ఓసారి కరోనా వైరస్ సోకిన తర్వాత ప్రస్తుతం వాడుతున్న మందులతో తగ్గిపోయి మళ్లీ కొన్ని వారాలు, నెలల తర్వాత తిరగబెట్టే అవకాశాలు లేకపోలేదని హార్వార్డ్ నిపుణుల బృందం తెలిపింది. అయితే ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చంటే హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందే వరకూ తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా వీటిని ఎదుర్కొనే హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు మనుషుల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అడిగితే మాత్రం వైరస్ కు వ్యాక్సిన్ లభిస్తే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. దీంతో అంతిమంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నాళ్లైనా వేచి చూడక తప్పదనే సంకేతాలను వారు ఇస్తున్నారు..

English summary
can you get infected with coronavirus again ?, now it is a big question for every patient suffered with this virus. an american doctors study reveals that there is least possibility of getting virus again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X