వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11,240 అడుగుల ఎత్తు నుంచి జారిపడి.. మృత్యుంజయుడిగా భారతీయ పర్వతారోహకుడు

|
Google Oneindia TeluguNews

అమెరికాలోని ఎత్తైన పర్వతం నుంచి కాలు జారి పడిపోయిన భారత సంతతికి చెందిన యువకుడు మృత్యుంజయుడుగా మారాడు. ఈ ప్రమాద ఘటన అమెరికా తీరప్రాంతంలోని ఓరేగాన్ స్టేట్‌లో జరిగింది. సుమారు 500 అడుగుల లోయలోకి పడినప్పటికి.. బతికి బయటకట్టిన ఘటన మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ మృత్యుంజయుడి సాహసాలు, ప్రమాద ఘటన గురించి మరిన్ని వివరాలు.. అమెరికాలోని ఎత్తైన పర్వతం నుంచి కాలు జారి పడిపోయిన భారత సంతతికి చెందిన యువకుడు మృత్యుంజయుడుగా మారాడు. ఈ ప్రమాద ఘటన అమెరికా తీరప్రాంతంలోని ఓరేగాన్ స్టేట్‌లో జరిగింది. సుమారు 500 అడుగుల లోయలోకి పడినప్పటికి.. బతికి బయటకట్టిన ఘటన మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మృత్యుంజయుడి సాహసాలు, ప్రమాద ఘటన గురించి మరిన్ని వివరాలు..

కెనడా పర్వతారోహకుడు

కెనడా పర్వతారోహకుడు

ప్రవాస భారతీయుడు, కెనడాకు చెందిన ఔత్సాహిక పర్వాతరోహకుడు గుర్బాజ్ సింగ్ తన స్నేహితులతో కలిసి మంగళవారం అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ హుడ్‌పైనున్న ది పెర్లీ గేట్స్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లాడు. పర్వతారోహణ క్రమంలో మంచుగడ్డపై పెట్టిన కాలు జారడంతో పెర్లీ గేట్స్ నుంచి డెవిల్స్ కిచెన్ ఏరియాలోకి జారి పడిపోయాడు. అతని సహచరులు, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది సకాలంలో కాపాడారు అని యూఎస్ మీడియా తన కథనంలో పేర్కొన్నది.

11,240 అడుగుల ఎత్తు నుంచి

11,240 అడుగుల ఎత్తు నుంచి

ఎత్తైన పర్వతం నుంచి అత్యంత ప్రమాదకర రీతిలో జారి పడటంతో గుర్బాజ్‌ కాలు విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదం జరిగినప్పుడు సుమారు 11,240 అడుగుల ఎత్తులో ఉన్నాడు. అక్కడి నుంచి 500 అడుగుల లోతులో పడ్డాడు. అతడిని వెతికి పట్టుకొనేందుకు కొన్ని గంటలు పట్టింది అని రెస్యూ టీమ్ వెల్లడించింది.

ప్రమాదవశత్తూ జారిపడిన తర్వాత

ప్రమాదవశత్తూ జారిపడిన తర్వాత

మౌంట్ హుడ్ పర్వతంపైకి గుర్బాజ్ చేరుకొన్నాడు. ఆ సమయంలో అనువైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలనుకొన్నాడు. కానీ పర్వతం శిఖరం ప్రమాదకరంగా ఉండటంతో గొడ్డలితో ఆసరా తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ కాలు జారడంతో లోయలో దొర్లిపడ్డాడు. ప్రస్తుతం సర్జరీ జరిగింది. హెల్మెట్ లేకపోతే ప్రాణాలకు భారీ ముప్పు కలిగేది అని గుర్బాజ్ తండ్రి రిషమ్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.

ఏటా 10 వేల మందికిపైగా

ఏటా 10 వేల మందికిపైగా

అమెరికాలో మౌంట్ హుడ్ పర్వతానికి ఎక్కువగా పర్వతారోహకుల తాకిడి ఉంటుంది. ప్రతీ ఏటా 10 వేలకుపైగా మంది పర్వతారోహకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తుంటారు. ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతారు అని యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు.

English summary
Canadian Climber Gurbaz Singh slips from 11,240 feet Mount Hood Of US. Now, he is recovering after surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X