• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం: పాముపై కప్పల సవారీ చేయడమా... ఏంటీ వింత..?

|

సాధారణంగా కప్పను చూస్తే పాముకి కోపం... పామును చూస్తే కప్పకు కోపం. పామును పట్టుకోవాలంటే కప్పను ఎరగా వేస్తాం. ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పాము కప్ప దోస్తీ కట్టాయి. దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం అంటూ డ్యూయెట్ పాడుకుంటూ రెండు ఒక్కటయ్యాయి. ఈ ఘటన మన దేశంలో జరగలేదు. ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది.

పాముపై కప్పల సవారీ

పాము ముంగీసా, పాము కప్ప బద్ద శత్రువులు అని మనకు తెలుసు. కానీ నాడు కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్లు కలికాలంలో అన్నీ తారుమరవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ కప్పల సమూహం పాముపై ఎంచక్కా సవారీ చేస్తే కెమెరా కంటికి చిక్కాయి. ఇక అసలు విషయానికొస్తే... ఆదివారం రోజున పశ్చిమ ఆస్ట్రేలియాలో పెద్ద గాలి తుఫాను వచ్చింది. దీంతో చెట్లు, పుట్టలు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. పొలాల్లోకి నీళ్లు వస్తున్నాయి. డ్యాములు కట్టలు తెంచుకోవడంతో నీరు దిగువన ఉన్న పొలాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పాల్ అనే వ్యక్తి పొలంలోకి నీళ్లు వస్తుండటం గమనించి కట్ట వేద్దామని తన పొలం వైపు వెళ్లాడు. అక్కడికెళ్లే సరికి పొలంలో నీళ్లు నిండిపోయాయి. గట్టున కొన్ని వందల సంఖ్యలో కప్పలు ఉండటాన్ని గమనించాడు.

సోషల్ మీడియాలో పాము కప్ప ఫోటోలు వైరల్

సోషల్ మీడియాలో పాము కప్ప ఫోటోలు వైరల్

ఇక కట్ట వేద్దామని పొలం దగ్గరకు వెళ్లే సరికి నీటిపై కప్పలు తేలియాడుతున్న దృశ్యాలను గమనించాడు. అంతలోనే షాక్‌కు గురయ్యాడు. నీటిలో నుంచి ఒక్కసారిగా ఓ పాము బయటకు వచ్చింది. ఆ పాము పై ఈ కప్పలు సవారీ చేస్తున్నట్లుగా కనిపించాయి. ఆ పాము నీటిలో అలా పాకుతూ వెళుతుండగా దానిపై ఈ కప్పలు కూర్చున్నాయి. ఎంచక్కా సవారీ చేశాయి. దీంతో వెంటనే తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు పాల్. పాల్ సోదరుడు ఆండ్రూ ఈ ఫోటోలను వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అంతే ఈ పోస్టు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు.

అక్కడి కప్పలకు అలవాటు పడిపోయిన పాము

అక్కడి కప్పలకు అలవాటు పడిపోయిన పాము

సాధారణంగా కప్పలను చూస్తే పాములు వదలవని అమాంతంగా మింగేస్తాయని అయితే ఈ పాముకు ఈ కప్పలతో పరిచయం ఉన్నట్లుగా తనకు అనిపించిందని చెప్పాడు పాల్. కొన్ని రోజులుగా ఈ కప్పలను ఇక్కడ నివసించే పాములు చూస్తుంటాయి కనుక వాటి జోలికి వెళ్లి ఉండకపోవచ్చునని పాల్ వివరించాడు. ఆ కప్పలకు ఈ పాములు అలవాటు పడిపోయ ఉంటాయి కాబట్టే వాటికి ఎలాంటి హాని తలపెట్టక పోయి ఉండొచ్చని పాల్ వివరించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A huge storm in Australia’s north on Sunday flushed out a sight which either fascinated or horrified those who saw it – 10 cane toads riding the back of a 3.5m python.Paul and Anne Mock were at home with their daughters in the remote West Australian town of Kununurra, when a large storm dumped almost 70mm of rain into their dam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more