వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్పీ నేత వివాదాస్పదం, కేసు: ప్యారిస్‌లో మూడో రోజు కాల్పులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మీరట్/ప్యారిస్: ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో చార్లీ హెబ్డో వారపత్రిక కార్యాలయం పైన దుండగుల దాడిని సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఎస్పీ నేత యాకుబ్ ఖురేషీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్వాలీ పోలీసు స్టేషన్లో ఖురేషి పైన గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఓం ప్రకాశ్ చెప్పారు.

ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దుండగుల దాడిలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, రూ.51 కోట్ల నగదు కానుకగా ఇస్తానని ఖురేషీ గురువారం మీరట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలు గీస్తే ప్యారిస్ పాత్రికేయులు, వ్యంగ్య చిత్రకారుల మాదిరి మరణం కొని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.

ఆయన వ్యాఖ్యల పైన బీజేపీ, ఇతర పార్టీలు భగ్గుమన్నాయి. ఖురేషీ పైన జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఖురేషీ 2006లోను ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేశారు. ప్రవక్త పైన వ్యంగ్య చిత్రాలు వేసిన వ్యక్తిని హతమారిస్తే రూ.51 కోట్లు ఇస్తానన్నారు. కాగా, తొలుత ఖురేషీ పత్రికా కార్యాలయం పైన దాడి చేసిన వారిని పట్టుకున్న వారికి రూ.51 కోట్లు తాజాగా ప్రకటించారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన అలా కాకుండా.. దాడిని సమర్థించారు.

కాగా, ప్యారిస్‌లో వరుసగా మూడో రోజు కూడా కాల్పులు జరిగాయి. ఈశాన్య పారిస్‌లో కారును వెంబడిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. కారులోని వ్యక్తులను బందీలుగా భావిస్తున్నారు. పత్రిక పైన దాడికి పాల్పడిన వ్యక్తులే కారులో వెళ్తుండవచ్చునని అనుమానిస్తున్నారు.

యాకుబ్ ఖురేషీ

యాకుబ్ ఖురేషీ

ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో చార్లీ హెబ్డో వారపత్రిక కార్యాలయం పైన దుండగుల దాడిని సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఎస్పీ నేత యాకుబ్ ఖురేషీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్యారిస్

ప్యారిస్

ఉగ్రవాద చర్యలతో ఫ్రాన్స్‌ అట్టుడికింది. బుధవారం నాడు చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి నుంచి ఫ్రాన్స్‌ తేరుకోకముందే.... గురువారం దేశంలో పలు చోట్ల పేలుళ్లు, కాల్పులు, దాడులు జరిగాయి.

ప్యారిస్

ప్యారిస్

పోలీసులను, ప్రార్థనా స్థలాలను, రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారు. గురువారం ఉదయం పారిస్‌ నగరానికి వెలుపల దక్షిణం వైపు ఉండే... పోర్ట్‌ డీ చాలిటన్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి బుల్లెట్‌ ప్రూఫ్‌ దుస్తులు ధరించి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు, ఒక స్థానిక అధికారి మరణించారు.

ప్యారిస్

ప్యారిస్

అనంతరం అగంతకుడు మెట్రో రైలులో పారిపోయాడు. దీంతో, అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని మరీ భద్రతా ఉన్నతాధికారులు, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బెన్నార్డ్‌ కజెన్యూవే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్యారిస్‌లో కాల్పులకు నిరసనగా ముంబైలో...

ప్యారిస్‌లో కాల్పులకు నిరసనగా ముంబైలో...

తాజా ఘటనకు, బుధవారం నాటి దాడికి సంబంధముండే అవకాశముందని మంత్రి బెన్నార్డ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, విల్లేఫ్రాంచి సర్‌సావోన్‌ నగరానికి తూర్పు ప్రాంతంలో ఒక మసీదుకు సమీపంలోని రెస్టారెంట్‌ వద్ద గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీన్ని నేరపూరిత చర్యగా స్థానిక అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు.

ప్యారిస్

ప్యారిస్

చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పారిస్‌కు పశ్చిమ వైపు ఉండే లీ మాన్స్‌ పట్టణంలోని మసీదుపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు గ్రెనేడ్లు విసిరారు. మరోవైపు, పోర్ట్‌ లా నైవెల్లా జిల్లాల్లో సాయంత్రం ప్రార్థనలు ముగిశాక ముస్లింల ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ఎవరూ గాయపడలేదు.

ప్యారిస్

ప్యారిస్

చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి ఘటనలో ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాల కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరు ఫొటోలను అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు.

లండన్లో...

లండన్లో...

చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టుల ఆధ్యర్యంలో పేపర్లు, పెన్నులు, పెన్సిళ్లు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నేను చార్లీ' అని నినాదాలు చేస్తూ... భావ ప్రకటన హక్కును కాపాడాలంటూ నినాదాలు చేశారు.

ఢిల్లీలో

ఢిల్లీలో

ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం పైన దాడిని నిరసిస్తూ ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీలో ఫ్రాన్స్‌కు చెందిన వారు నివాళులు..

English summary
A case has been registered against former Uttar Pradesh minister and BSP leader Haji Yakub Qureshi for his controversial comments, in which he defended the terror attack on French satirical magazine Charlie Hebdo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X