వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్విగ్న పరిస్థితులివి: కేటలోనియా స్వాతంత్ర్యం.. నిప్పులు చెరిగిన స్పెయిన్

యూరోపియన్ యూనియన్ సభ్య దేశం స్పెయిన్‌లోని ఒక ప్రాంతమైన కేటలోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకోవడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బార్సిలోనా/మాడ్రిడ్: యూరోపియన్ యూనియన్ సభ్య దేశం స్పెయిన్‌లోని ఒక ప్రాంతమైన కేటలోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకోవడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. కేటలోనియా పార్లమెంట్ తమ దేశం 'రిపబ్లిక్‌గా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నది' అనే పేరుతో శుక్రవారం తీర్మానం ఆమోదించిన వెంటనే స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్పెయిన్‌లో 40 ఏళ్ల తర్వాత రాజకీయ సంక్షోభం మరో నూతన దశకు చేరుకున్నది. కేటలోనియా పార్లమెంట్ తీర్మానం ఆమోదించిన తర్వాత స్పెయిన్ ప్రధాని మారియానో రాజోయ్ మీడియాతో మాట్లాడుతూ కాటలోనియా ప్రాంత అధ్యక్షుడు కార్లెస్ పౌగ్డెమాంట్‌పై నిప్పులు చెరిగారు.
కేటలోనియాలో వచ్చే డిసెంబర్ 21వ తేదీన తాజాగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రాంతీయ పోలీసుల సహకారంతో కేటలోనియా ప్రభుత్వాన్ని తొలగిస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా కేటలోనియా రాయబార కార్యాలయాలను మూసేస్తున్నట్లు ప్రకటించారు. 'సాధ్యమైనంత త్వరలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు స్వేచ్ఛాయుతంగా స్వచ్ఛమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం' మారియానో రాజోయ్ తెలిపారు. దీంతో స్పెయిన్, కేటలోనియాల్లో ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 భారీగా విపక్ష సభ్యుల సభ్యుల బహిష్కరణ..

భారీగా విపక్ష సభ్యుల సభ్యుల బహిష్కరణ..

అంతకుముందు 135 మంది సభ్యులు గల కేటలోనియా పార్లమెంట్ ‘స్వాతంత్ర్య తీర్మానాన్ని' ఆమోదించింది. 70 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా, 10 మంది వ్యతిరేకించారు. రెండు ఓట్లు చెల్లలేదు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు విపక్ష సభ్యులు సభను బహిష్కరించారు. అంతకుముందు విపక్ష సభ్యులు తమ సీట్లపై స్పెయిన్, కేటలోన్ పతాకాలను పెట్టి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. కేటలోనియా పార్లమెంట్ తీర్మానం ఆమోదించగానే బయట వేల మంది ప్రదర్శన నిర్వహించి ‘ఇండిపెండెన్స్' అని నినాదాలు చేశారు. సంబురాలు చేసుకున్నారు. కానీ కొన్ని నిమిషాల్లోనే స్పెయిన్ ప్రధాని మారియానో రాజోయ్.. రాజ్యాంగంలోని 155 అధికరణాన్ని అనుసరించి కేటలోనియా సర్కార్ ను రద్దు చేసేశారు. తనకు గల అసాధారణ అధికారాలతో కేటలోనియాలో ప్రత్యక్ష పాలన అమలులోకి వస్తుందని ప్రకటించారు. సివిల్, పోలీస్, ఆర్థిక శాఖలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

ప్రజలు సంయమనం పాటించాలని స్పెయిన్ ప్రధాని పిలుపు

ప్రజలు సంయమనం పాటించాలని స్పెయిన్ ప్రధాని పిలుపు

కేటలోనియా పార్లమెంట్ తీర్మానాన్ని గుర్తించబోమని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జర్మనీ, అమెరికా ప్రకటించాయి. స్పెయిన్ ఐక్యతకు అవసరమైన మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ప్రజలంతా సంయమనం పాటించాలని కేటలోనియన్లకు మారియానో రాజోయ్ విజ్నప్తి చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తనివ్వవద్దని అభ్యర్థించారు. అంతకుముందు అత్యవసరంగా క్యాబినెట్‌తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఒకవేళ తిరుగుబాటు దారులపై అభియోగాలు రుజువైతే కేటలోనియా ప్రధాని పౌగ్డెమంట్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
గమ్మత్తేమిటంటే కేటలోనియా జనాభా మొత్తం 75 లక్షల మంది మాత్రమే. కానీ వారిలో స్వాతంత్ర్య పిపాస మొదటి నుంచే కొనసాగుతూ వస్తున్నది.

 అనాదిగా రగులుతున్న జాతీయ భావనలే ప్రేరణ

అనాదిగా రగులుతున్న జాతీయ భావనలే ప్రేరణ

స్పెయిన్‌లో రగిలిన వేరు కుంపటి ఇది. కేటలోనియాలో వ్యక్తమైన స్వాతంత్య్ర కాంక్ష ఇది. స్పెయిన్‌ ఈశాన్య ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రజాభీష్టం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెయిన్‌ నుంచి వేరుపడటం కోసం కేటలోనియా పూర్తిస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధపడటం యూరోపియన్‌ యూనియన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన నిర్వహించిన రిఫరెండంలో కేటలోనియా వాసులు విడిపోవడానికి అనుకూలంగా ఓటేశారు. కానీ స్పెయిన్ న్యాయస్థానాలు మాత్రం అది చట్ట విరుద్ధమని ప్రకటించాయి. ఓటింగ్‌లో వెలువడే ఫలితాన్ని బట్టి రెండురోజుల్లోగా కేటలోనియా పార్లమెంటు దీనిని స్వతంత్ర దేశంగా ప్రకటించాల్సి ఉంది. ఇది ఎంతమాత్రం నచ్చని స్పెయిన్‌ ప్రభుత్వం ఈ స్వాతంత్రోద్యమాన్ని భగ్నం చేయడానికి సర్వశక్తులొడ్డింది.

వేరే దేశంగా గుర్తించేందుకు స్పెయిన్ రాజ్యాంగం నిరాకరణ

వేరే దేశంగా గుర్తించేందుకు స్పెయిన్ రాజ్యాంగం నిరాకరణ

1931లో స్పెయిన్‌ రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత కేటలోనియాకు విస్తృత స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. కేటలోనియాకు సొంత పార్లమెంటు, కార్యనిర్వాహకవర్గం ఉన్నాయి. అయితే స్పెయిన్‌ రాజ్యాంగం ప్రకారం వేరే దేశంగా మాత్రం దీనిని గుర్తించడం లేదు. స్పెయిన్‌లో అంతర్యుద్ధానికన్నా ముందు కాటలోనియా విస్తృత స్వయం ప్రతిపత్తిని అనుభవించింది. 1939-75 మధ్యలో జనరల్‌ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో హయాంలో కాటలోనియా స్వయంప్రతిపత్తిని, జాతీయ వాదాన్ని అణచేశారు. కాటలోనియా భాష వినియోగాన్ని నియంత్రించారు. ఫ్రాంకో మరణం తర్వాత ప్రజాస్వామ్య స్పెయిన్‌ అవతరించిన తర్వాత-1978 రాజ్యాంగం ప్రకారం కేటలోనియాకు తిరిగి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తిని ఇచ్చారు. 2006లో ఇచ్చిన ఆర్థికాధికారాలు దీన్నో ‘దేశం' స్థాయిలో నిలిపేలా చేశాయి. కేటలోనియా వాసుల జాతీయవాదానికి 2010లో స్పెయిన్‌ రాజ్యాంగ కోర్టు పరిమితులు విధించడం కేటలోనియా వాసుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పట్నుంచి జాతీయవాద భావాలు మరింత పెచ్చుమీరాయి. స్వయం నిర్ణయాధికారం కోసం ఓటింగ్‌ జరపాలంటూ గత ఐదేళ్లుగా ఇక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వస్తూనే ఉంది.

 కట్టే పన్నులెక్కువ.. ఇచ్చే నిధులు తక్కువ

కట్టే పన్నులెక్కువ.. ఇచ్చే నిధులు తక్కువ

యూరోపియన్‌ యూనియన్‌లోని అత్యుత్తమ నగరాల్లో బార్సిలోనా ఒకటి. 1992 ఒలింపిక్స్‌ను ఇక్కడ ఘనంగా నిర్వహించారు. వాణిజ్య ప్రదర్శనలు, ఫుట్‌బాల్‌, పర్యాటకానికి ఇది పెట్టింది పేరు. 2008లో స్పెయిన్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, నిధుల కోత కేటలోనియాను బాగా దెబ్బతీశాయి. దాదాపు 19 శాతం మంది నిరుద్యోగులయ్యారు. తాము మాడ్రిడ్‌(స్పెయిన్‌ రాజధాని)కి ఇస్తున్న దానికన్నా.. పొందుతున్నది చాలా తక్కువని చాలామంది కేటలోన్లు అనుకుంటూ ఉంటారు. 2014లో కేటలోనియా ప్రాంతం నుంచి పన్నుల రూపంలో దాదాపు 1000 కోట్ల యూరోలు వెళ్లాయి. కానీ అంత మొత్తాన్ని తమ ప్రాంతానికి ఖర్చుచేయలేదనేది ఇక్కడి ప్రజల వాదన. 2003లో ఈ ప్రాంతంలో స్పెయిన్‌ ప్రభుత్వం దాదాపు 16 శాతం మేర పెట్టుబడులు పెడితే.. 2015 నాటికి అవి 9.5 శాతానికి పడిపోయాయి. ఇవన్నీ ఇక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. కేటలోనియా స్వాతంత్య్రాన్ని కోరుకునే రెండు పార్టీలు ప్రాంతీయ ప్రభుత్వాన్ని గట్టిగా బలపర్తుంటాయి. 2014 నవంబర్‌లో ఒకసారి లాంఛనంగా జరిపిన ఓటింగ్‌లో దాదాపు 80 శాతం మంది స్వాతంత్య్రం కావాలంటూ ఓటేశారు. స్పెయిన్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ.. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 11వ తేదీన బార్సిలోనాలో జరిగిన జాతీయ దినోత్సవానికి దాదాపు 10 లక్షల మంది హాజరై తమ స్వాతంత్య్ర కాంక్షను వ్యక్తంచేశారు.

ప్రజాభిప్రాయ సేకరణ ఓటు స్పెయిన్‌ రాజ్యాంగానికి

ప్రజాభిప్రాయ సేకరణ ఓటు స్పెయిన్‌ రాజ్యాంగానికి

విరుద్ధమని, అది దేశ సమైక్యతకు ముప్పు అని ప్రధాని మరియానో రజోయ్‌ వాదిస్తున్నారు. స్పెయిన్‌ పౌరులందరికీ ఉమ్మడి, అవిచ్ఛిన్న భూభాగం ఇదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయడానికి వీల్లేదని కుండబద్ధలు కొడుతున్నారు. బాస్క్‌ కంట్రీ, గాలీసియాలాగానే కేటలోనియా ఇప్పటికే చాలావరకు స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవిస్తున్న విషయాన్ని స్పెయిన్‌లోని యూనియనిస్టులు గుర్తుచేస్తున్నారు. ఈ ఓటు చట్టవ్యతిరేకమని దేశ రాజ్యాంగ కోర్టు స్పష్టంచేసినందువల్ల దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనిచ్చేది లేదన్నది వీరి మొండిపట్టు. ప్రజాభిప్రాయానికి కేటలోనియా స్థానిక ప్రభుత్వం సహకరిస్తోందన్న భావనతో ఆ ప్రభుత్వానికి అన్నివైపులా నియంత్రణలు విధిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన నిర్వహించిన రిఫరెండంలో భాగంగా.. రిపబ్లిక్‌ రూపంలో కాటలోనియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మీరు అనుకూలమా? కాదా? స్పెయిన్‌ నుంచి వేరుపడటం కోసం కాటలోనియా ఓటర్లకు వేసిన ప్రశ్న ఇది.

English summary
Move passed with 70 votes in favour, 10 against and 2 blank ballots in 135-member House; Madrid to impose direct rule. Catalonia’s regional parliament declared independence from Spain on Friday in a disputed vote that is now likely to be declared illegal by Spain’s constitutional court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X