వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో అంతే?: అధికారి చేతివాటం! కువైట్ ప్రతినిధి వ్యాలెట్ జేబులోకి(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

అధికారి చేతివాటం! కువైట్ ప్రతినిధి వ్యాలెట్ జేబులోకి(వీడియో)

న్యూఢిల్లీ: ఓ పాకిస్థాన్ అధికారి దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు వచ్చిన ఓ కువైట్ ప్రతినిధికి చెందిన వ్యాలెట్‍ను దొంగతనం చేస్తూ సీసీటీవీ కెమెరాలకు దొరికిపోయాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆ అధికారి పరువు పోయింది.

పాక్ ప్రధానితో భేటీ కోసం..

పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ వెల్లడించిన కథనం ప్రకారం.. పెట్టుబడి ప్రణాళికపై చర్చలు జరిపేందుకు కువైట్ నుంచి ప్రతినిధుల బృందం గతవారం పాకిస్థాన్ వచ్చింది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యాలయంలో ఈ బృందం పాక్ అధికారులతో చర్చలు జరిపింది.

వ్యాలెట్ మర్చిపోయిన కువైట్ ప్రతినిధి

వ్యాలెట్ మర్చిపోయిన కువైట్ ప్రతినిధి

అనంతరం వారు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ బృందంలోని ఓ ప్రతినిధి తన వ్యాలెట్‌ను సమావేశం జరిగిన గదిలోనే మర్చిపోయారు. బయటకెళ్లాక తన వ్యాలెట్ లేదని గమనించిన ఆ కువైట్ ప్రతినిధి పాకిస్థాన్ అధికారులకు విషయం చెప్పారు.

ఎవరూ లేని సమయం చూసి వ్యాలెట్ జేబులో వేసుకున్నాడు..

ఈ క్రమంలో కార్యాలయ సిబ్బంది ఆ భయనమంతా వెదికారు. జూనియర్ స్థాయి ఉద్యోగులను ప్రశ్నించారు. అయినా ఆయన వ్యాలెట్ దొరకలేదు. చివరకు అధికారులు సమావేశం గదిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఓ సీనియర్ అధికారి దొంగిలించినట్లు గుర్తించారు. గ్రేడ్-20 అధికారి అయిన ఆ వ్యక్తి.. గదిలో ఎవరూ లేని సమయం చూసి ఆ వ్యాలెట్‌ను తన జేబులో వేసుకుంటున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.

పాక్ అధికారిపై విమర్శల వర్షం.. ఆ దేశంపైనా..

దీంతో సదరు అధికారిని ప్రశ్నించారు. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన అధికారి చివరకు సీసీటీవీ దృశ్యాల విషయం చెప్పడంతో వ్యాలెట్‌ను తిరిగి ఇచ్చేసినట్లు డాన్ పేర్కొంది. ఘటన అనంతరం సదరు అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, సదరు అధికారి దొంగతనం చేసిన దృశ్యాల వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు.

English summary
A Pakistani official was caught on camera stealing the wallet of a Kuwaiti delegate on Friday. The incident occurred when a delegation from Kuwait was on a two-day visit to Pakistan for a Joint Ministerial Commission meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X