వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ -2: నాసా ఆర్బిటార్‌కు చిక్కని విక్రమ్‌ల్యాండర్ జాడ

|
Google Oneindia TeluguNews

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-2కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించడంలో విఫలమైంది. నాసాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ ఈ నెల ప్రారంభంలో చంద్రుడి చుట్టూ తిరిగి చంద్రయాన్-2 ల్యాండర్ ఫోటోలను తీసింది. కానీ తాజాగా తీసిన ఫోటోల్లో ల్యాండర్ కనిపించలేదు. అయితే చంద్రుడికి అవతల వైపున అంటే పూర్తిగా నీడపడే చోటున విక్రమ్ ల్యాండర్ ఉండి ఉంటుందని అమెరికా శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.ఇది కాకపోతే ఫోటోగ్రాఫ్ తీసిన ప్రాంతంలో కాకుండా మరో చోట ల్యాండర్ ఉండి ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

విక్రమ్ ల్యాండర్ జాడ కోసం రెండు సార్లు ప్రయత్నాలు

విక్రమ్ ల్యాండర్ జాడ కోసం రెండు సార్లు ప్రయత్నాలు

గత నెల సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ గాడి తప్పి గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత తిరిగి సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది వీలుపడలేదు. ఇక చంద్రుడిపై రోజులు ముగియడంతో అక్కడి వాతావరణం చల్లగా మారడంతో విక్రమ్ ల్యాండర్ పూర్తిగా డెడ్ అయ్యింది. అందులోని పరికరాలు చల్లదనానికి గడ్డకట్టిపోయి పనిచేయడం మానేశాయి. ఇక గ్రౌండ్ స్టేషన్‌తో విక్రమ్ ల్యాండర్ సంబంధాలు కోల్పోయినప్పటి నుంచి నాసా దాని జాడ కనుగొనేందుకు రెండు సార్లు ప్రయత్నించింది. సెప్టెంబర్ 17న నాసాకు చెందిన లూనార్ రికనైసన్స్ ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన చోటుపైనుంచి ఎగిరి కొన్ని ఫోటోలను తీసింది. ఆ తర్వాత అక్టోబర్ 14న మరోసారి ఎగిరింది. రెండు సార్లు ల్యాండ్ అయిన చోటును మాత్రమే గుర్తించగలిగింది కానీ ల్యాండర్‌ జాడ మాత్రం కనుగొనలేకపోయింది.

నీడ రావడంతో తొలి ప్రయత్నం విఫలం

నీడ రావడంతో తొలి ప్రయత్నం విఫలం

చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇక్కడే ఎందుకంటే ఇక్కడ చాలా క్రేటర్లు ఉన్నాయి. సూర్యుడి నుంచి వెలువడే కాంతి నేరుగా ఈ ప్రాంతాన్ని తాకుతున్నందునే ల్యాండర్‌ను ఇక్కడ ల్యాండ్ అయ్యేలా శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. నాసా ల్యాండర్ జాడను తొలిసారిగా కనుగొనే ప్రయత్నంలో అప్పటికే చిన్నగా చీకటి పడుతోంది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతను మెల్లగా నీడ ఆవహించింది. ఈ కారణంగానే నాసా ఎల్‌ఆర్ఓ విక్రమ్ ల్యాండర్‌ను కనుగొనలేక పోయి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక రెండో ప్రయత్నంలో వెలుతురు బాగానే ఉంది. కానీ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో నీడ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకే రెండో సారి కూడా ల్యాండర్ జాడను నాసా కనుగొనలేకపోయింది.

 ల్యాండర్ ల్యాండ్ కాకముందు.. అయిన తర్వాత ఫోటోలు

ల్యాండర్ ల్యాండ్ కాకముందు.. అయిన తర్వాత ఫోటోలు

ఇదిలా ఉంటే అక్టోబర్ 14న జరిగిన రెండో ప్రయత్నంలో లూనార్ రీకానైసన్స్ ఆర్బిటార్ చంద్రయాన్ -2 ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రాంతంలో ఫోటోలు తీసిందని అయితే ల్యాండర్ ఆ సమీప ప్రాంతాల్లో ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నాసా శాస్త్రవేత్త నోవా ఎడ్వర్డ్ పెట్రో చెప్పారు.అంతేకాదు అక్టోబర్ 14న తీసిన ఫోటోలను విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కాకముందు ఆ ప్రాంతాన్ని తీసిన ఫోటోలను పోల్చి చూసినట్లు ఎడ్వర్డ్ తెలిపారు. రెండు ఫోటోల మధ్య ఏమైనా తేడాలు కనిపిస్తే ఫలానా చోట ల్యాండర్ ఉందని చెప్పేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఈ ఫోటోల నుంచి తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. కచ్చితంగా విక్రమ్ ల్యాండర్ నీడ ఆవహించిన ప్రాంతంలోనే ఉండి ఉంటుందని, దక్షిణ ప్రాంతంలో తక్కువ అక్షాంశం అంటే 70 డిగ్రీలతో ఉంటుంది కాబట్టి అక్కడ నీడ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
US space agency Nasa was unable to find any signs of the Chandrayaan-2 lander Vikram in fresh photos its lunar orbiter took of the landing site on the Moon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X