వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన తుపాకీతోనే 9మందిని చంపాడు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని కరోలినా చర్చ్‌లో బుధవారంరాత్రి ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తొమ్మిదిమంది ప్రాణాలు తీసిన శ్వేతజాతి యువకుడు డిలాన్‌ స్టార్మ్‌ రూఫ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డిలాన్‌‌ జైలులో ఉన్నాడు.

ఆశ్చర్యకర విషయమేమిటంటే.. తన తండ్రి తన పుట్టిన రోజుకు కానుకగా ఇచ్చిన తుపాకీతోనే డిలాన్.. చర్చిలో కాల్పులకు తెగబడ్డాడు. నల్లజాతీయులు ఎక్కువగా ప్రార్థనలు చేసుకునే చర్చిలో.. జాత్యహంకారంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

డిలాన్‌ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. డిలాన్‌తో కలిసి చదువుకున్నవారిలో పెక్కుమంది ఇతడిని గుర్తుపట్టడంలేదు. ఎవరితోనూ పెద్దగా కలిసే వ్యక్తికాదని ఒక యువకుడు చెప్పినట్టు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే డిలాన్‌కు జాత్యహంకార ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Charleston shooting updates: Suspect Dylann Roof's gun was birthday gift, official says

ఎప్పుడూ ఆఫ్రో అమెరికన్లపై జోక్‌లు వేసేవాడని వారు చెబుతున్నారు. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని మరో విద్యార్థి చెప్పాడు. ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఫొటోలో డిలాన్‌ చొక్కాకు రెండు పతాకాలు పెట్టుకుని కనిపించాడు. అందులో ఒకటి జాత్యహంకార పాలననాటి దక్షిణాఫ్రికా పతాకం, అలాగే రెండవది రొడీషియా పతాకం. వీటినిబట్టి డిలాన్‌కు చాలాకాలంగానే జాత్యహంకార ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతోంది.

మృతులతో ఎలాంటి సంబంధం, వ్యతిరేకత లేనప్పటికీ ఈ దారుణానికి పాల్పడ్డాడు మిలాన్. దుర్ఘటన జరిగిన ఇమాన్యుల్‌ ఆఫ్రికన్‌ మెథాడిస్ట్‌ ఎపిస్కోపల్‌ చర్చ్‌ వద్ద మృతులకు భారీ ఎత్తున ప్రజలు నివాళి అర్పించారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిని రూపుమాపవలసి ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గురువారం రాత్రి పిలుపు ఇచ్చారు.

English summary
Dylann Storm Roof, the suspect in the shooting that killed nine people at a historic black church in Charleston, S.C., on Wednesday night, was arrested Thursday in North Carolina and taken back to Charleston. Meanwhile, the victims' identities emerged, and the community mourned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X