వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చిపై కాల్పులు: శవాలపై చిందులేశాడు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సౌత్‌ కెరోలినాలోని చర్చ్‌లో విచక్షణంగా కాల్పులు జరిపి 9 మంది ప్రాణాలు బలిగొన్న నర హంతకుడు డిలాన్‌ రూఫ్‌.. ఆ తర్వాత రాక్షసుడిలా ప్రవర్తించాడు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తుల శవాలపై ఆనందంతో చిందులేశాడు.

కాగా, డిలాన్‌ అలా చేస్తున్న సమయంలో అక్కడే మరో ఆఫ్రో అమెరికన్‌ కూడా ఉన్నాడట. అయితే డిలాన్‌ అతడిపై కాల్పులు జరపకుండా ఇక్కడ ఏం జరిగిందో మీ వాళ్లందరికీ చెప్పమని ఆదేశించాడట. 21ఏళ్ల డిలాన్‌ను.. ఈ పని ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నిచంగా.. ఎవరో ఒకరు ఆ పని చేయవలసిందే కదా! అని డిలాన్‌ చెప్పినట్లు తెలిసింది.

ఆశ్చర్యకర విషయమేమిటంటే.. తన తండ్రి తన పుట్టిన రోజుకు కానుకగా ఇచ్చిన తుపాకీతోనే డిలాన్.. చర్చిలో కాల్పులకు తెగబడ్డాడు. నల్లజాతీయులు ఎక్కువగా ప్రార్థనలు చేసుకునే చర్చిలో.. జాత్యహంకారంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

Charleston suspect Dylann Roof’s alleged manifesto discovered online

డిలాన్‌ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. డిలాన్‌తో కలిసి చదువుకున్నవారిలో పెక్కుమంది ఇతడిని గుర్తుపట్టడంలేదు. ఎవరితోనూ పెద్దగా కలిసే వ్యక్తికాదని ఒక యువకుడు చెప్పినట్టు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే డిలాన్‌కు జాత్యహంకార ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

డిలాన్‌ మామూలుగా స్నేహితులతో ఆఫ్రో అమెరికన్లపై అనాగరికమైన జోకులు వేయడమే గాక, తాను హిట్లర్‌ బాటలో నడుస్తున్నానని చెప్పడానికి అన్ని విధాలా యత్నించాడు. హెయిల్‌ హిట్లర్‌ అన్న సంకేతాలు గల టి-షర్టులు వేసుకునే డిలాన్‌కు పేస్‌బుక్‌లో సరిగ్గా 88 మంది మిత్రులే ఉన్నారు.

ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఫొటోలో డిలాన్‌ చొక్కాకు రెండు పతాకాలు పెట్టుకుని కనిపించాడు. అందులో ఒకటి జాత్యహంకార పాలననాటి దక్షిణాఫ్రికా పతాకం, అలాగే రెండవది రొడీషియా పతాకం. వీటినిబట్టి డిలాన్‌కు చాలాకాలంగానే జాత్యహంకార ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతోంది. అంతేగాక, అతను తన మేనిఫెస్టోను కూడా పెట్టుకున్నాడు.

English summary
A website surfaced Saturday featuring a racist and rambling manifesto and dozens of photos of accused Charleston church shooter Dylann Roof posing with white supremacy symbols and the Confederate flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X