వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిగురించిన స్నేహం: అత్యంత సురక్షితమైన ‘బీస్ట్’ లోపలి భాగాన్ని చూపిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

సింగపూర్ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మంగళవారం జరిగిన భేటీ వారి మధ్య మంచి స్నేహాన్ని చిగురింపజేసినట్లుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరున్న అమెరికా అధ్యక్షుడి వాహనాన్ని కిమ్‌కు ప్రత్యేకంగాచూపించారు.

'వెరీ వెరీ గుడ్‌': కిమ్‌ను వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన ట్రంప్, కీలక ఒప్పందాలపై సంతకాలు'వెరీ వెరీ గుడ్‌': కిమ్‌ను వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన ట్రంప్, కీలక ఒప్పందాలపై సంతకాలు

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

డొనాల్డ్ ట్రంప్ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ అత్యంత శక్తివంతమైన తన కారును కిమ్‌కు స్వయంగా చూపించడం విశేషం. భోజనాలు ముగిసిన తర్వాత తమ భద్రతా సిబ్బందితో ట్రంప్, కిమ్‌లు పోర్టు కోలో ఉన్న బీస్ట్ వద్దకు వచ్చారు. ఎప్పుడూ ట్రంప్ వెన్నంటే ఉండో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కారు తలుపు తీసి లోపల భాగాలను కిమ్‌కు చూపించారు.

ట్రంప్-కిమ్ భేటీ: ఆనందం, అద్భుతమంటూ ఇరు దేశాధినేతలు, ఇంకా ఏమన్నారంటే..?ట్రంప్-కిమ్ భేటీ: ఆనందం, అద్భుతమంటూ ఇరు దేశాధినేతలు, ఇంకా ఏమన్నారంటే..?

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

అయితే, అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఈ ది బీస్ట్(కాడిలాక్) సమీపంలోకి కూడా ఎవరినీ రానీయరు. అలాంటిది కిమ్ జోంగ్ ఉన్‌కు ట్రంప్ వెంట తీసుకెళ్లి మరీ కారు లోపలి భాగాలను చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి సైనిక, రసాయనిక దాడినైనా ఈ బీస్ తట్టుకోగలుతుంది. ఈ కారు విలువ రూ. సుమారు రూ.10.78కోట్లు.

ఆశ్చర్యంలో ముంచెత్తారు: సింగపూర్ వీధుల్లో కిమ్ చక్కర్లు, సెల్ఫీలు దిగారు ఆశ్చర్యంలో ముంచెత్తారు: సింగపూర్ వీధుల్లో కిమ్ చక్కర్లు, సెల్ఫీలు దిగారు

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

కాగా, కిమ్ భద్రతకు ఉపయోగించే వాహనం కూడా ట్రంప్ బీస్ట్‌కు తక్కువేం కాదు. ఆయుధాలతో కూడిన మెర్సిడెస్ బెంజ్ ఎస్600కారు కిమ్ ఉపయోగిస్తారు. దీని విలువ 2మిలియన్ డాలర్లు కావడం గమనార్హం. అంటే ట్రంప్ బీస్ట్ కారు కంటే 0.4మిలియన్ డాలర్లు ఎక్కువగానే ఉందన్నమాట ఈ కారు ఖరీదు. కాగా, ట్రంప్, కిమ్ సమావేశాలు విజయవంతమయ్యాయని భేటీ అనంతరం ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాయని తెలిపారు.

English summary
President Donald Trump offered North Korea leader Kim Jong Un a rare glimpse inside the presidential limousine known as “The Beast” on Tuesday as their historic summit in Singapore wound down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X