• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Interesting:ప్రపంచ అపర కుబేరుల్లో కిమ్ జాంగ్ ఉన్.. అనధికారిక జాబితాలో వీరుకూడా..!

|

ఏటా ప్రపంచ కుబేరుల జాబితాను పలు మ్యాగజీన్లు విడుదల చేస్తాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అంతేకాదు ప్రపంచ కుబేరుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చాలామందిలో ఉంటుంది. సాధారణంగా అత్యంత ధనికుల జాబితాను ప్రముఖ మ్యాగజీన్లు ఫోర్బ్స్ మరియు ఫార్చ్యూన్‌లు విడుదల చేస్తాయి.

  Check Out The List Of Wealthy Persons In The World That No One Reveals

  వీటితో పాటు బ్లూంబర్గ్ ఇండెక్స్ కూడా భూమిపై ఉన్న కుబేరుల విషయాలకు సంబంధించిన జాబితాను బయటపెడుతుంది. ఇక ఈ మూడు మ్యాగజీన్లు ప్రపంచ కుబేరులకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తున్నప్పటికీ కొన్ని సంస్థలు తమకున్న విధానాల వల్ల ఆ కంపెనీకి సంబంధించిన కొందరి పేర్లను బయట పెట్టడం లేదు.

   అపర కుబేరుల్లో చాలామంది

  అపర కుబేరుల్లో చాలామంది

  ప్రపంచ ధనికుల జాబితాను ప్రకటించే ఫోర్బ్స్ మరియు బ్లూంబర్గ్‌లాంటి సంస్థలు వారి సంస్థకు చెందిన వారి పేర్లను ప్రకటించవు. ఇందుకు కారణం ఆ కంపెనీలకు కొన్ని పాలసీలు ఉండటమే. ఉదాహరణకు బ్లూంబర్గ్ వ్యవస్థాపకులు మైఖేల్ బ్లూంబర్గ్ ప్రపంచ ధనికుల జాబితాలో ఉంటున్నప్పటికీ అతని పేరును జాబితాలో చేర్చరు. ఈ మధ్యే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఆయన దాదాపు 50 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు.

  అంటే ఈయనకున్న ఆస్తులు చూస్తే కచ్చితంగా ప్రపంచ కుబేరుల ఆస్తులకు సమానంగా ఉంటారని అనుకోవచ్చు. ఇక బ్రూనే సుల్తాన్, అండర్‌ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బషర్ అల్ అసద్‌లు కూడా ఈ కోవలోకే వస్తారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా ఉన్నప్పటికీ అధికారిక జాబితాలో మాత్రం వీరి పేర్లు కనిపించవు. వీరి గురించి తెలుసుకుందాం.

  హసన్ బోల్‌కియా, బ్రూనే సుల్తాన్

  హసన్ బోల్‌కియా, బ్రూనే సుల్తాన్

  బ్రూనే సుల్తాన్ హసన్ బోల్‌కియాకు 20 బిలియన్ డాలర్ల మేరా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇది పదేళ్ల క్రితం మాట. ఆయనకు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయ్స్‌ కార్లు 600 ఉండగా, అతని ఇళ్లు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ రెసిడెన్స్‌గా గుర్తింపుపొందింది. ఈ ఇంట్లో 1800 గదులున్నాయి. ఇక ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ విలువ 350 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇలాంటి బంగ్లాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయని సమాచారం.

  దావూద్ ఇబ్రహీం ఆస్తులు అప్పట్లోనే...

  దావూద్ ఇబ్రహీం ఆస్తులు అప్పట్లోనే...

  దావూద్ ఇబ్రహీం. అండర్ వరల్డ్ డాన్. ఇతను భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. గత మూడు దశాబ్దాలుగా అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడు. 1993 బాంబే పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కనిపించింది లేదు. 1970లో చిన్న స్థాయి క్రిమినల్‌గా జీవితంను ప్రారంభించి ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ డీలర్ స్థాయికి ఎదిగాడు. 1989లోనే అతని ఆస్తులు 25 బిలియన్ డాలర్లు అని ఓ పత్రిక అంచనా వేసింది.

  కిమ్ జాంగ్ ఉన్ ఆస్తులు ఎంతంటే..

  కిమ్ జాంగ్ ఉన్ ఆస్తులు ఎంతంటే..

  ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ కుబేరుల జాబితాలో కనిపించరు. కానీ అతని ఆస్తులు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన ఏ స్థాయిలో ఆస్తులను సంపాదించాడో ఎవరి ఊహకు అందని విషయం. చిన్న దేశానికి అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ 5 బిలియన్ డాలర్లు మేరా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఉత్తరకొరియాలోని సహజ సంపదను విక్రయించడం ద్వారా పోగేశారని తెలుస్తోంది. అంతేకాదు విలాసవంతమైన కార్లు లేనప్పటికీ అతను జీవితం మాత్రం అత్యంత విలాసవంతమైనదిగా తెలుస్తోంది.

  ఇలా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల ఆస్తులు బయటకు తెలియడం ద్వారా వీరు ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కుతున్నారు కానీ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తమ ఆస్తులు వివరాలు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతూ కాలం గడుపుతున్న అపర కుబేరులు చాలామందే ఉన్నారు.

  English summary
  There are many rich people on the planet who does not share their assets. In such list are North Korean President Kim Jong Un, Dawood Ibrahim and Sultan of Brunei.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X