వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా బాలుడికి పాలస్తీనియన్ల నివాళి: 'పట్నాయక్' సైతం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట టర్కీ పర్యాటక ప్రాంతం బోడ్రమ్ బీచ్‌కు చనిపోయి కొట్టుకొచ్చిన సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్లు నివాళులర్పించారు. గాజా బీచ్‌లో 30 మంది పాలస్తీనియన్లు బాలుడి మృతి స్థితిని గుర్తుకు తెస్తూ ఎర్రని టీషర్ట్ లు, నీలంరంగు ప్యాంట్లు ధరించి ముఖాన్ని కిందకు ఉంచుతూ దాదాపు 20 నిమిషాల పాటు ఇసుకలో బోర్లా పడుకున్నారు.

సిరియా నుంచి యూరప్‌కు పడవలో వలస పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న మూడేళ్ల పసికందు ఫోటో సిరియా శరణార్ధుల సమస్యపై యావత్ ప్రపంచం దృష్టిన ఆకర్షించింది. అంతేకాదు యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్న దమననీతికి, సిరియా శరణార్ధుల దుర్భరస్ధితికి ఈ చిత్రం అద్దం పట్టింది.

Check out sand-artist Sudarshan Pattnaik's heart-warming tribute to Syrian toddler Aylan Kurdi

బాలుడి ఘటనకు సంతాపంగా గాజా బీచ్ లో సైకత శిల్పులు బాలుడి సైకతశిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పానికి కొద్ది అడుగుల దూరంలోనే ఈ రోజు పాలస్తీనియన్లు ఘనంగా నివాళులర్పించారు. ఈ ఫోటో అనంతరం ప్రపంచ దేశాలు వలస సంక్షోభ పరిష్కారానికి సమాయత్తమయ్యాయి.

శరణార్ధులకు మేము ఆశ్రమం ఇస్తామంటూ ఐరోపా దేశాలు ముందుకొస్తున్నాయి. శరణార్ధులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న వారికి అభినందనలు అంటూ సైకత శిల్పం కింద రాశాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో ఇప్పటివరకు 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి.

English summary
Everyone has been grieving the death of Syrian refugee toddler Aylan Kurdi who was found on the shores of Greek island of Kos on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X