వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్: విద్యార్థులను కాపాడి ప్రాణాలొదిలిన ప్రొఫెసర్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. ఆపదొస్తే వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టగలనని నిరూపించారు ఓ ప్రొఫెసర్‌. తూటాలకు భయపడకుండా పోరాడి ప్రాణాలొదిలారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన పాకిస్థాన్‌లోని బచాఖాన్‌ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసే సయ్యద్‌ హమీద్‌ హుస్సేన్‌(34) ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి కొందరు విద్యార్థుల ప్రాణాలు కాపాడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా, యూనివర్సిటీ నుంచి తప్పించుకొని బయటపడిన ఓ విద్యార్థి తమను కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ సయ్యద్‌ హమీద్‌ కాపాడినట్లు తెలిపాడు. బచ్చాఖాన్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం తాలిబన్ ఉగ్రవాదులు ముట్టడించి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నప్పుడు భవనంలోనుంచి బయటకు వెళ్లకూడదని తన విద్యార్థులను అప్రమత్తం చేసిన రసాయన శాస్త్రం బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో సాయుధ ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులు జరిపారు.

అయితే కొద్ది సేపటికే ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో ఆయన నేలకూలారు. ఉగ్రవాదుల తూటాలకు బలయిన 24మందితో పాటు విద్యార్థులను కాపాడడానికి ఉగ్రవాదులపైకి తిరగబడిన హమీద్ హుస్సేన్ వీరమరణం పొందారు. ఉగ్రవాదుల మొదటి తూటా చప్పుడు వినగానే భవనంలోంచి బయటకు వెళ్లొద్దని తమ కెమిస్ట్రీ లెక్చరర్ తనను హెచ్చరించారని జహూర్ అహ్మద్ అనే విద్యార్థి చెప్పాడు.

 Chemistry teacher defies Taliban in Bacha Khan University attack

తమ లెక్చరర్ పిస్టల్‌ను పట్టుకోవడాన్ని తాను చూశానని, తరువాత ఒక బుల్లెట్ అతనికి తగలడం చూశానని అహ్మద్ తెలిపాడు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండటాన్ని కూడా తాను చూశానని వివరించాడు. ముగ్గురు ఉగ్రవాదులు నినాదాలిస్తూ తమ డిపార్ట్‌మెంట్ మెట్లవైపు పరుగెత్తుకుంటూ వస్తుండటాన్ని తాము చూశామని, తమ కెమిస్ట్రీ ప్రొఫెసర్ తన పిస్టల్‌తో ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారని మరో విద్యార్థి తెలిపాడు.

తమ ప్రొఫెసర్ కిందపడి పోవడం తాము చూశామని, ఉగ్రవాదులు రిజిస్ట్రార్ ఆఫీస్‌లోకి ప్రవేశించగానే తాము పారిపోయామని అతను వివరించాడు. మిలిటెంట్ల తూటాలకు హమీద్ బలయిన విషయాన్ని అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ ధృవీకరించారు.

కాగా, అనేక మంది నెటిజన్లు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరమరణం పొందారని శ్లాఘిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. బుధవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 21 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

English summary
A chemistry teacher who tried to protect his students by opening fire on Taliban militants during a deadly attack at the Bacha Khan University has been hailed as a “martyr” and a “gentleman”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X